ఒక్క నైట్‌కి 15 లక్షల రేటు.. 23కే అన్నీ చూపించేశా: షకీలా

0

షకీలా అంటే కొవ్వొత్తి అని అర్ధం.. తాను కరిగిపోతూ లోకానికి వెలుగునివ్వడమే కొవ్వొత్తి లక్షణం. తాను కూడా అంతే అంటోంది ఈ దక్షిణాది శృంగార తార. ఒకప్పుడు టాప్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించిన షకీలా.. హీరోయిన్‌గా ఎదగాలని ఆశపడిన … చివరికి శృంగార తార‌గా ఎలా మారిందో ఇప్పటికే ఆమె పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు. తాజాగా ఆమె టీఎన్ఆర్‌ (ఐడ్రీమ్స్)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు.

ఆస్తులు అన్నీ పోవడానికి కారణం ఆమెనే..

ఒకప్పుడు హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్న నేను ఆస్తులు పోగొట్టుకోవడానికి, సంపాదించకపోవడానికి కారణం అందర్నీ నమ్మడమే. నమ్మకమే నన్ను ఈ పరిస్థితికి తీసుకువచ్చింది. చిన్నప్పటి నుండి నేను మా అక్క లేకుండా ఏదీ చేసేదాన్ని కాదు. నేను డ్రెస్ కొనుక్కోవాలన్నా అక్కదే ఫైనల్ నిర్ణయం. అలాంటిది ఏదైనా ఆస్తులు కొనాలనుకున్నప్పుడు ఏదో ఒక కారణంతో ఆపేసేది. 

నేను ఏ తప్పు చేయలేదని ఆమెకూ తెలుసు. ఆమె చదువు కోవాలంటే ఉన్న కాస్త ఆస్తిని ఆమెకు ఇచ్చేశా. వాళ్లను గుర్తు చేసుకుని చాలాసార్లు ఏడ్చా. అమ్మని అమ్మా అని పిలిస్తే.. అక్కని మమ్మీ అనేదాన్ని. అలాందిని నన్నే మోసం చేసింది. నేను ఏ తప్పూ చేయలేదని రోజుకైనా వాళ్లు తెలుసుకుంటారనే నమ్మకం అయితే ఉంది. 

అమ్మ కూడా నన్ను మోసం చేసింది.. 
అమ్మ అంటే అందర్నీ ఒకేలా చూడాలి. కాని నన్ను మాత్రం వేరేలా చూసేది. నేను సంపాదించినప్పుడు కూడా నన్ను తక్కువగా చూసింది. నేను ఆ పని చేశానంటే ఆమె ప్రోద్భలం ఎక్కువ. ఆమే దగ్గర ఉండి నన్ను పంపించేది. 

నా కన్యత్వం ఎప్పుడు పోయిందంటే.. 
మొదటి సారి నన్ను ఒకతనిదగ్గరకు పంపినప్పుడు అతన్ని బతిమిలాడితే ఏం చేయకుండా వదిలేశాడు. నాకు అది ఎప్పుడు కావాలనుకున్నానో.. ఎవరితో ఉండాలనుకున్నానో అప్పుడు నాకు కన్యత్వం లేదు. 

నితీష్ కుమార్ నాకు లాస్ట్ వాడు.. 
మా అమ్మ, అక్క, అన్నలతో విభేదాలు వచ్చాయి. ఇక నా లవ్ స్టోరీస్ చాలానే ఉన్నాయి. ఇంచుమించు ఏడెనిమిది మందితో రిలేషన్‌లో ఉన్నా. ఒక్కొక్కడితో పదేళ్లు, ఏడేళ్లు, నాలుగేళ్లు ఇలా ఉండేదాన్ని. నా లాస్ట్ వాడు నితీష్ కుమార్ అతనితో పదేళ్లు ఉన్నా. నేను ఇప్పటికీ కాంప్రమైజ్ అయ్యి ఉంటే పెళ్లి అయ్యేది. 

నా వయసు 43.. నో బ్యాంక్ బ్యాలెన్స్ 
ఇప్పుడు నేను కంఫర్టబుల్‌ లైఫ్‌లో ఉన్నా. పెద్దగా ఆస్తులు లేవు. మందు పార్టీలు జరిగితే అమ్మాయిల కంపెనీనే కోరుకుంటా. ఎందుకంటే.. అబ్బాయిలతో మందు పార్టీ చివర ఏం అడుగుతారో నాకు తెలుసు. 

ఆ నిర్మాత వస్తావా? అన్నాడు. క్యాస్టింగ్ కౌచ్ ఆ ఒక్క సినిమాకే.. 
నేను చాలా సినిమాలు చేసినప్పటికీ ఎవరూ పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. అయితే ఒక నిర్మాత సినిమా షూటింగ్ అయిపోయిన తరవాత అడిగాడు. అతని పేరు చెప్పడం ఇష్టం లేదు. 

గతంలో డబ్బుల కోసమే ఆ పని చేశా.. 
నాకు షూటింగ్‌లో రోజుకి రూ. 10 వేలు దొరికితే ఎప్పుడూ ఆ పని చేయనని ప్రామిస్ చేసుకున్నా. కాని నాకు ఒక్కరోజుకి రూ.3 లక్షలు ఇచ్చే టైంలో.. నైట్‌కి వస్తే రూ. 15 లక్షలకి అడిగారు. ఆ టైంలో మూడు లక్షలా? 15 లక్షలా అనుకున్నప్పుడు 15 లక్షలు చాలా ఈజీ. కాని దేవుడ్ని మోసం చేయలేంగా. ఆ భయంతో వద్దని అనేదాన్ని. 

23 లోనే మొత్తం చూపించేశా.. పోర్న్ చేయను 
ఇప్పుడు నా వయసు 43 సంవత్సరాలు. 23లోనే పూర్తిగా ఎక్స్‌పోజింగ్ చేసి మొత్తం చూపించేశా. ఈ వయసులో మంచి యాక్టింగ్ చూపించాలని అనుకుంటున్నా. అందుకే ‘కొబ్బరి మట్ట’ చిత్రంలో నటించా’ అంటూ తన మనోగతాన్ని పంచుకున్నారు షకీలా. 
Please Read Disclaimer