3 రాజధానులు: జగన్ పై షకీలా పంచ్

0

షకీలా అంటే సెక్స్ బాంబ్.. ఒకప్పుడు దక్షిణాదిని ఊపేసిన పోర్న్ స్టార్.. సన్ని లీయోన్ ఎలానో షకీలా కూడా అంతే.. అయితే ఇప్పుడు ఈ శృంగార భరిత చిత్రాన్ని వదిలేసి చిత్రాల్లో హోమ్ లీ పాత్రలు చేస్తూ తరిస్తోంది.

సెక్స్ బాంబ్ అయిన షకీలా కుటుంబ కథా చిత్రం చేస్తే ఎలా ఉంటుంది? వామ్మో ఊహించుకోవడానికే షేకింగ్ గా ఉందా? కానీ ఇది నిజం..

షకీలా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం’ మూవీ తాజాగా టీజర్ విడుదలైంది. వీఎన్ సతీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను 24 క్రాఫ్ట్స్ బ్యానర్ పై సతీష్ నిర్మిస్తున్నారు.

ఈ టీజర్ లో ఏపీ సీఎం జగన్ పై షకీలా పంచ్ వేయడం సంచలనంగా మారింది. ఇటీవలే ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. చర్చనీయాంశంగా మారిన ఈ టాపిక్ నే షకీలా మూవీ టీజర్ లో ప్రస్తావించి ఎద్దేవా చేయడం విశేషం.

షకీలా మూవీ టీజర్ లో ‘ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు’ అని పేపర్ లో వార్తను చదివి షకీలా ఆశ్చర్యపోతుంది. ‘ఆంధ్రాకి మూడు రాజధానులేంటి?’ అని అసిస్టెంట్ గా పనిచేస్తున్న వ్యక్తిని ప్రశ్నిస్తుంది. దీనికి అసిస్టెంట్ .. జగన్ అన్న మూడు రాజధానులు చేసేశాడుగా’ అని సమాధానిమిస్తాడు.. దీనికి పంచ్ వేస్తూ షకీలా.. ‘ఒక్క స్టేట్ కే మూడు రాజధానులా? పోను పోను ఒక్క రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులైనా ఆశ్చర్య పోనవసరం లేదు’ అని పంచ్ వేశారు.
Please Read Disclaimer