అదో చెత్త న్యూస్ అన్న శక్తి కపూర్

0

నిజం మొదటి అడుగు వేసేలోపు అబద్దం భూమండలం మొత్తాన్ని ఒకసారి చుట్టి వస్తుందట. ఇదొక పాపులర్ కొటేషన్. ఒక సారి వరల్డ్ ట్రిప్ వేయడం ఏం ఖర్మ.. చంద్రమండలం.. సౌరమండలం అన్నీ చుట్టి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు. రూమర్ అంటే అబద్ధమనే కదా? రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ గురించి ఒక వార్త వచ్చింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది దాని గురించే.

శ్రద్ధ కపూర్ తన చిన్ననాటి స్నేహితుడు.. ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అయిన రోహన్ శ్రేష్ఠ ను వచ్చే ఏడాది మనువాడబోతోందని.. ఈ ఏడాది చివర్లోనే నిశ్చితార్థం ఉంటుందని వార్తలు వచ్చాయి. ముంబై జనాలే కాకుండా ఇక్కడ సౌత్ జనాలు కూడా ఇది నిజమని నిజ్జంగా నమ్మారు. ‘సాహో’ బ్యూటీ త్వరలో శ్రీమతి అవుతుందని అనుకున్నారు. మామూలుగానే రోహన్ – శ్రద్ధాలు చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుంటారు కాబట్టి నిజమే అనుకోవడంలో ఎవరినీ తప్పుపట్టలేం. కానీ ఇదే విషయంపై శ్రద్ధ తండ్రిగారు శక్తి కపూర్ సాబ్ ను ప్రశ్నిస్తే.. అయన ‘బుల్ షిట్టు’ అని చిరాకు ప్రదర్శించాడట. బుల్ షిట్ అంటే అర్థం అయింది కదా.. ఇంకా వివరించాలా?

కొంతమందికి ఒక్క ముక్కలో చెప్తే విషయం అర్థం కాదు కాబట్టి ఆయనే వివరించాడు. శ్రద్ధ తన కెరీర్ లో చాలా బిజీగా ఉందని.. కనీసం ఐదేళ్ళ వరకూ పెళ్ళి ఆలోచన లేనే లేదని గట్టిగా రూమర్లకు సమాధానం చెప్పాడు. నాన్నగారు సరే.. పాపగారికి కూడా మనసులో అదే ఆలోచన ఉందా లేకపోతే వేరే ఆలోచన ఉందా?
Please Read Disclaimer