నా కూతురు పెళ్లా.. ప్లీజ్ నన్ను కూడా పిలవండి!

0

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ గత కొంత కాలంగా రోషన్ శ్రేష్టతో ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. వీరిద్దరు చెట్టా పట్టాలేసుకుని తెగ తిరిగేస్తున్నారు. పార్టీలకు పబ్ లకు కలిసి తిరుగుతున్న వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ముంబయికి చెందిన ఒక ప్రముఖ మీడియా సంస్థ వీరి పెళ్లిని నిర్ధారిస్తూ పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా కథనం రాసింది. దాంతో అన్ని మీడియా సంస్థలు కూడా ఆ కథనంను బలపర్చుతూ శ్రద్దా కపూర్ పెళ్లి వార్తలను ప్రచురించాయి.

శ్రద్దా కపూర్ పెళ్లి వార్తల నేపథ్యంలో కొన్ని మీడియా సంస్థలు ఆమె తండ్రి శక్తి కపూర్ ను ప్రశ్నించాయి. పెళ్లి గురించి ఆయన విచిత్రంగా స్పందించాడు. ‘నిజంగానే నా కూతురు పెళ్లా ? ఆ పెళ్లి ఎక్కడ ? ఎప్పుడు జరగబోతుందా నాకు కాస్త చెప్పరా? ప్లీజ్ నా కూతురు పెళ్లికి నన్ను పిలవడం మర్చి పోకండి అంటూ కామెంట్స్ చేశాడు. ఆయన మాటలతో శ్రద్దా కపూర్ పెళ్లి వార్తలు నిజం కాదని తేలిపోయింది.

మీడియాలో నిన్నంతా వచ్చిన వార్తలు ఫేక్ అని తేలిపోయింది. ప్రస్తుతం హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న శ్రద్దా కపూర్ ఎందుకు పెళ్లి చేసుకుంటుందని ఆమె ఇంకొంత కాలం పెళ్లికి ఆగుతుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు మూడు సినిమాలు చేయడంతో పాటు టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘సాహో’ చిత్రంలో నటించింది. ఆగస్టు 15న సాహో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Please Read Disclaimer