బేబీ మరీ సన్నబడిందే

0

విజయ్ దేవరకొండను స్టార్ ను చేసిన మూవీ ‘అర్జున్ రెడ్డి’. సెన్షేషనల్ సక్సెస్ అయిన ఆ చిత్రంతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోల స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను దక్కించుకున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండేకు కూడా మంచి గుర్తింపు దక్కింది. అయితే ఆమెకు ఆ గుర్తింపు ఆఫర్లు తెచ్చిపెట్టలేక పోయాయి. ఒకటి రెండు వచ్చినా కూడా షాలిని పాండేకు అవి కలిసి రాలేదు. అర్జున్ రెడ్డి చిత్రంలో బొద్దుగా కనిపించిన ముద్దుగుమ్మ అవకాశాల కోసం బాగా సన్నబడింది.

అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండకు పోటీగా ముద్దులు పెట్టి కుర్ర కారును ఉర్రూతలూగించిన బొద్దుగుమ్మ షాలిని పాండే ఇప్పుడు సన్నజాజి తరహాలో సన్నగా మారినా కూడా పట్టించుకునే వారే కరువయ్యారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ అమ్మడి ప్రయత్నాల దండయాత్ర కొనసాగుతుంది. కాని ఎక్కడ కూడా ఈమెను చూడటం లేదు. ఫిల్మ్ మేకర్స్ దృష్టిలో పడేందుకు సన్నబడ్డ తర్వాత ఫొటో షూట్ చేయించుకుని మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

నాజూకుగా తయారైన ఈ అమ్మడు అందాల ప్రదర్శనకు ఎంత మాత్రం అడ్డు చెప్పనంటూ తన ఫొటోల ద్వారా చెప్పకనే చెబుతోంది. ఈ అమ్మడు తనకు ఇప్పుడు కాకున్నా ఇంకా ప్రయత్నిస్తే తర్వాత అయినా ఆఫర్లు వస్తాయనే నమ్మకంతో ఉంది. అర్జున్ రెడ్డి సక్సెస్ ను అందరు బాగానే వాడేసుకున్నారు. కాని అందులో కీలకమైన ఈ బేబీకి మాత్రం అదృష్టం కలిసి రాలేదు.