హాట్ బికిని.. గ్రేట్ ఫిలాసఫీ

0

బాలీవుడ్ లో ఎంతోమంది బ్యూటీలు ఉన్నారు. ఒక్క ఫోటోతో సోషల్ మీడియాలో మంట పెట్టగల టాలెంట్ వారి సొంతం. అలాంటి టాలెంట్ పుష్కలంగా ఉన్న భామల్లో ఒకరు షమ సికందర్. ఈ భామ తన కెరీర్ మొదట్లో సినిమాల్లో నటించింది కానీ పెద్దగా బ్రేక్ రాలేదు. అందుకే సీరియల్స్ లో సెటిల్ అయి అక్కడ తన సత్తా చాటుతోంది. అయితే అప్పుడప్పుడూ అవకాశం వచ్చినప్పుడు సినిమాలలో కూడా నటిస్తుంది. ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్ కావడంతో తన ఫాలోయర్లను ఊపిరిసలుపుకునేంత సమయం కూడా ఇవ్వకుండా ఏదో ఒక బికిని ఫోటో పోస్ట్ చేస్తూనే ఉంటుంది.

తాజాగా మరోసారి అదేపని చేసింది. ఈ ఫోటోకు “ఎప్పుడైనా మీకు ‘ఈ పనిని సాధించగలనా.. ఇంకెంత దూరం ప్రయాణించగలను’ అనే అనుమానం వస్తే.. ఇప్పటివరకూ ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చారో గుర్తుతెచ్చుకోండి. ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు.. ఎలాంటి యుద్ధాలను మీరు గెలిచారు.. ఎన్ని భయాలను మీరు అధిగమించారు.. ఇవన్నీ గుర్తు చేసుకోండి” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నిజమే.. అప్పుడప్పుడు మనమీద మనకే అనుమానాలు వస్తుంటాయి. బైట ఎవరో జఫ్ఫాగాళ్ళకు ఇలా అనుమానం వస్తే పట్టించుకోనవసరం లేదు కానీ మనమీద మనకే అనుమానం వస్తే ఈ హాట్ బ్యూటీ చెప్పినట్టు మనం గతంలో సాధించినవాటిని గుర్తు చేసుకొని మనల్ని మనం ‘ఛీరప్ బ్రో.. చిల్ & గెట్ గోయింగ్’ అని వెన్ను తట్టుకోవాలి.

సరే పర్సనాలిటీ డెవెలప్ మెంట్ క్లాసు బాగానే ఉంది.. హాటు పాప క్యాప్షన్ గోలలో పడి అసలు బికిని సంగతే మర్చిపోయాం. రెడ్ కలర్ బికిని ధరించి.. రెడ్ కలర్ టాప్ లాంటిది ఊరికే చేతులకు తగిలించుకొని అందమైన ఒక స్టార్ హోటల్ లోని స్విమ్మింగ్ పూల్ లో అప్సరసలాగా నడుస్తూ పోజిచ్చింది. అందాల విందు సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అది.. పాప పోస్ట్ లో ఎప్పుడూ ఉండేదే. తడిగా ఉన్న జుట్టు.. పట్టులా ఉన్న చర్మం.. నిగనిగలాడుతున్న ఆ మేనిరంగు.. ఆ సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ అదిరిపోయింది. ఈ ఫోటోకు “షమ.. రెడ్ హాట్ బ్యూటి”.. “సబ్ కో మిర్చి లగీ హై”.. “99.99 రెడ్ బికిని ఎఫ్ఎం” అంటూ కామెంట్లు పెట్టారు. షమ సినిమాల విషయానికి వస్తే ‘బైపాస్ రోడ్’ అనే హిందీ చిత్రంలో నటిస్తోంది.
Please Read Disclaimer