మళ్ళీ హాటు బికినీ అవతారం

0

బాలీవుడ్ బ్యూటీల హంగామా సోషల్ మీడియాలో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి బ్యూటీల లిస్టులో షమ సికందర్ ఒకరు. ఒక్క ఫోటోతో సోషల్ మీడియాలో మంటలు పెట్టగల టాలెంట్ షమ సొంతం. షమ మొదట్లో కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించినా.. ప్రస్తుతం హిందీ సీరియల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ‘సీఐడీ’.. ‘బాల్ వీర్’ లాంటి సీరియల్స్ తో పాటుగా ‘ఝూమ్ ఇండియా’.. ‘బూగీ వూగీ’ లాంటి రియాలిటీ షోస్ లో కూడా పాల్గొంది. ‘మాయ’.. ‘అబ్ దిల్ కి సున్’ లాంటి వెబ్ సీరీస్ లలో నటించింది.

షమ తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా రెండు ఫోటోలు పోస్ట్ చేసింది. అందులో ఒక ఫోటోకు “ఓ దేవతా.. అతను నరకం అంటే ఏంటో చూసి అందులో నుంచి బయటకు వచ్చాడు. నువ్వు అతన్ని మనసును ముక్కలు చేయలేదు.. నీకు అలాంటి శక్తి లేదు” అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ భామ టర్కీదేశంలోని బోడ్రమ్ బీచ్ రిసార్ట్ లో సేదదీరుతూ ఉంది. ఈ ఫోటోలో నియాన్ పింక్ బికినీ ధరించి ఓ బ్యూటిఫుల్ బీచ్ ఇసుకలో మోకాళ్ళపై కూర్చుంది. తెల్లటి ఇసుక… నేపథ్యంలో సముద్రపు నీటిపై రిసార్ట్ గదులు.. ఆరెంజ్ కలర్ లో ఆకాశం.. వ్యూ అదిరిపోయింది. అసలే హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రెస్ గా ఉండే భామ కావడంతో బికినీకే కొత్త అందం వచ్చింది. మరో ఫోటోలో ఇసుకలో పడుకొని అందాలను ఫుల్లుగా వడ్డించింది.

ఈ పిక్ నెటిజన్లకు తెగ నచ్చింది. షమ క్యాప్షన్ లో మీనింగ్ సంగతి దేవుడెరుగు.. బికినీకి మాత్రం సూపర్ లైకులు వచ్చాయి. “బాంబ్ షెల్ ఇన్ పింక్”.. “పర్ఫెక్ట్ బికినీ బాడీ”.. “స్టన్నింగ్ బ్యూటీ కిల్లర్ పోజ్”.. “షమ ఈజ్ ఆన్ ఫైర్” అంటూ కామెంట్లు కూడా పెట్టారు.
Please Read Disclaimer