పదివేల వోల్టుల షాకిచ్చే బికినీ

0

హాటు బ్యూటీలను శ్రద్దగా ఫాలో అయ్యే వారికి షమ సికందర్ పేరు తెలియకుండా ఉండదు. ముఖ్యంగా కొందరు నెటిజన్లు బికీనీ ఫోటోలంటే చాలు ఎంతో ఉత్సాహంగా చూస్తుంటారు. అందమే ఆనందం.. బికినీయే సోషల్ మీడియా మకరందం టైపు ఫిలాసఫీ నమ్మే జనాలు. అందుకే ఈ ఇలాంటి కళాపిపాసులకోసమే అన్నట్టుగా క్రమం తప్పకుండా షమ బికినీ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.

తాజాగా మరో ఫోటోతో నెటిజన్ల ముందుకొచ్చింది. ఈ ఫోటోకు షమ “మీ మనసు మీరు ఏం చెప్తే అది నమ్ముతుంది. మీరు నమ్మకం ఇవ్వండి.. సత్యం ఇవ్వండి.. ప్రేమ ఇవ్వండి” అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. ఈ సందేశమేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. జనాలు అవన్నీ ఇస్తున్నారో తెలీదు కానీ షమ ఫోటో చూస్తే మాత్రం “కాస్త కళాపోషణ ఇవ్వండి.. రసికత అలవాటు చేసుకోండి.. మరీ మొద్దులా ఉండకండి” అనే సందేశం ఇచ్చినట్టుంది. ఓ అందమైన బీచ్ లొకేషన్లో వెరైటీగా కనిపించే చెట్ల వేర్ల దగ్గర బ్లాక్ స్విమ్ వేర్ ధరించి హొయలుపోయింది. లైట్ రెడ్ కలర్ లిప్ స్టిక్ తో.. లూజ్ హెయిర్ తో అలా నిలుచుంది. ఆ వయ్యారం చూస్తుంటే ఆడజాతిని విపరీతంగా ద్వేషించే మగ అక్కుపక్షి కూడా తన అభిప్రాయాలను బుర్ర నుంచి షిఫ్ట్ డిలీట్ కొట్టడం ఖాయమే.

పిండికొద్ది రొట్టె.. ఫోటోకొద్ది కామెంట్లు. ఈ ఫోటో కూడా అందుకు ఎక్సెప్షన్ కాదు. “బికినీ కోసమే పుట్టింది”.. “హాటెస్ట్ బ్లాక్ బికినీ”.. “నహీ.. మేరెసే అబ్ నహీ హోగా” అంటూ కొందరు నెటిజన్లు తమ స్పందన తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే ‘బైపాస్ రోడ్’ అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా నవంబర్ 1 న రిలీజ్ అవుతోంది.