రాజమండ్రి రానున్న ఇండియన్ 2

0

2.0 ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా కమర్షియల్ గా శంకర్ మరోసారి తన స్టామినా మరోసారి నిరూపించాడు. బడ్జెట్ మితిమీరి పోవడంతో పాటు ఎక్కువ రేట్లకు సినిమాను అమ్మడంతో ఫైనల్ గా నష్టాలు తప్పలేదు. అయినా శంకర్ బ్రాండ్ కు వచ్చిన నష్టం ఏమి లేదు. ప్రస్తుతం ఇండియన్ 2 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న శంకర్ ఇవాళ రాజమండ్రికి వచ్చాడు. క్యాజువల్ గా వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఇది లొకేషన్స్ కోసమే అయ్యుంటుంది. ఓ టిఫిన్ సెంటర్ పరిసరాలతో పాటు కొన్ని కీలక ప్రదేశాలను సందర్శించిన శంకర్ అన్ని తన టీమ్ కు సూచించి ప్రతి ఒక్కటి నోట్ చేసుకుని సమాచారాన్ని భద్రపరచమని చెప్పాడట.

సో ఇక్కడ షూటింగ్ జరిగే అవకాశాలు ఫిక్స్ అయినట్టే. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ ఎంట్రీ కూడా ఖాయమయ్యింది. మరో యూత్ హీరో ఉంటారని టాక్ ఉంది కాని ఫలానా అని శంకర్ ఎవరిని ధృవీకరించలేదు. సాధారణంగా రాజమండ్రి పరిసరాల్లో చిత్రీకరణ జరుపుకునే చిత్రాలకు హిట్ సెంటిమెంట్ బలంగా ఉంది. గతంలో రాఘవేంద్ర రావుతో మొదలుకుని వంశీ దాకా ఎందరో ఇక్కడ క్లాసిక్స్ తీసిన సందర్భాలు ఉన్నాయి.

ఇప్పుడు ఇండియన్ 2 కి సైతం ఇదే వర్తిస్తుందని శంకర్ తో స్థానికులు ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. ఒకవేళ ఫిక్స్ అయితే ఎన్నో ఏళ్ళ తర్వాత కమల్ రాజమండ్రికి వచ్చినట్టు అవుతుంది. ఇక్కడా అశేష అభిమానులు ఉన్న లోక నాయకుడికి ఘన స్వాగతం లభించడంలో ఎలాంటి అనుమానం లేదు. ప్రారంభోత్సవం జరుపుకున్నా ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాని ఇండియన్ 2లో తమిళ్ బిగ్ బాస్ 3 పూర్తి కాగానే కమల్ జాయిన్ కాబోతున్నట్టు సమాచారం.
Please Read Disclaimer