కమల్ అభిమానులకు గిఫ్ట్ ఇచ్చిన శంకర్

0

సౌత్ ఇండియా విలక్షణ నటుడు సీనియర్ హీరో కమల్ హాసన్ 65వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సహా తమిళ తెలుగు కన్నడ మలయాళ హిందీ పరిశ్రమల నుంచి ఈ లోకనాయకుడు కమల్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కమల్ ను ప్రశంసిస్తూ ట్వీట్ల వర్షం కురుస్తోంది.

అయితే కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా సౌత్ ఇండియా గ్రేట్ దర్శకుడు శంకర్ తాజాగా ఆయన అభిమానులకు పుట్టిన రోజు కానుక అందించాడు. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఇండియన్ 2’ నుంచి ప్రీలుక్ ను శంకర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా విడుదల చేశారు.

శంకర్ విడుదల చేసిన కమల్ హాసన్ ఫొటో వైరల్ గా మారింది. ఓ చారిత్రక కట్టడం నుంచి కిందకు నగరాన్ని ఠీవీగా చూస్తున్న కమల్ లుక్ అదిరిపోయేలా ఉంది. ఈ ఫొటోను షేర్ చేసిన శంకర్ హ్యాపీ బర్త్ డే సార్ అంటూ రాసుకొచ్చాడు. ఇక అభిమానులు మాత్రం కమల్ ఫోటో షేర్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు.

1996లో కమల్ హీరోగా శంకర్ తీసిన ‘భారతీయుడు’ మూవీ దక్షిణాదిన బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దానికి సీక్వెల్ గా ఇన్నేళ్ల తర్వాత అదే శంకర్ భారతీయుడు2 తీస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ తీస్తున్న ఈ చిత్రంలో కాజల్ రకుల్ సిద్ధార్త్ కీలక పాత్రధారులు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ భారీ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Please Read Disclaimer