ఆ ఇద్దరు స్టార్ హీరోలతో శంకర్

0

‘2.ఓ’ చిత్రంతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయిన శంకర్ ప్రస్తుతం ‘ఇండియన్ 2’ చిత్రాన్ని చేసే పనిలో ఉన్నాడు. కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తున్న ఈ చిత్రం త్వరలో మళ్లీ పట్టాలెక్కబోతుంది. ప్రస్తుతం కొత్త నటీనటులను ఈ చిత్రం కోసం ఎంపిక చేసే పక్రియ జరుగుతోంది. కాస్టింగ్ కాల్ ఇవ్వడంతో ఇండియన్ 2 గురించి ఉన్న అనుమానాలు అన్ని కూడా తొలగి పోయాయి. ఇండియన్ 2 తర్వాత శంకర్ చేయబోతున్న సినిమాలు ఏంటీ అనే విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

శంకర్ ఒక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని చేస్తాడనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హీరో విక్రమ్ స్పందిస్తూ ‘ఇండియన్ 2’ చిత్రం తర్వాత విజయ్ తో శంకర్ సినిమా ఉంటుందని.. ఆ తర్వాత తనతో ఒక చిత్రాన్ని చేయబోతున్నట్లుగా విక్రమ్ చెప్పుకొచ్చాడు. గతంలో విక్రమ్ హీరోగా శంకర్ రెండు చిత్రాలను తెరకెక్కించాడు. ఆ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా అపరిచితుడు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక విజయ్ తో ‘3 ఇడియట్స్’ చిత్రాన్ని తమిళంలో శంకర్ రీమేక్ చేశాడు. రీమేక్ లు అలవాటే లేని శంకర్ సినిమా కంటెంట్ నచ్చడంతో రీమేక్ కు సిద్దం అయ్యాడు. అయితే విజయ్ కి అది అంతగా సక్సెస్ ను ఇవ్వలేదు. ఆ కారణంగానే విజయ్ తో ఒక సూపర్ హిట్ తీయాలనే పట్టుదలతో శంకర్ చాలా కాలంగా ఉన్నాడు. ఇండియన్ 2 చిత్రం తర్వాత విజయ్ తో ఒక భారీ చిత్రాన్ని శంకర్ చేసే అవకాశం ఉంది. కమల్ హాసన్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ విజయ్ మరియు విక్రమ్ ల చిత్రాలను శంకర్ చేయనున్నాడు.
Please Read Disclaimer