సినీ సెలబ్రిటీస్ – నెంబర్ సెంటిమెంట్…!

0

సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువగా నమ్ముతారనే విషయం అందరికి తెలిసిందే. ఇది మన ఒక్క టాలీవుడ్ కే పరిమితం కాలేదు. ప్రతి ఇండస్ట్రీలోనూ ఇలాంటివి నమ్ముతారు. ఆ హీరోకి రెండు అక్షరాల టైటిల్ అయితే ఆ సినిమా హిట్ అని.. ఈ హీరోకి ఆ నెంబర్ లక్కీ అని.. ఆ హీరోయిన్ ని తీసుకుంటే సినిమా ప్లాప్ అవుతుందని.. ఆ డైరెక్టర్ తో సినిమా తీస్తే నెక్స్ట్ హిట్ రావడానికి చాలా కాలం పట్టుద్దని.. వాళ్ళు ఆడియో ఫంక్షన్స్ కి వస్తే ఫలితం వేరేలా ఉంటుందని.. కొందరు స్టార్ హీరోలు సినిమా ఓపెనింగ్ కి వస్తే మూవీ ప్లాప్ అవుద్దని.. సినిమా కంప్లీట్ అయ్యే దాకా గడ్డం పెంచుకుంటే సినిమా హిట్ అవుద్దని.. తలకి గుడ్డ కట్టుకుంటే విజయం వరిస్తుందని.. ఇలా రకరకాల సెంటిమెంట్స్ ఫాలో అవుతుంటారు. అయితే అవన్నీ మూఢ నమ్మకాలని వాటిని బ్రేక్ చేసి చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ నిజమేమో అనే డౌట్ వచ్చేలా చేసిన సందర్భాలు లేకపోలేదు.

ఈ నేపథ్యంలో కొంతమంది స్టార్ హీరోలు కొన్ని నెంబర్లని లక్కీ అని భావిస్తూ ఉంటారు. వాటినే తమ కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ గా లేదా బైక్ నెంబర్ గా.. మొబైల్ నెంబర్ గా వచ్చేలా చూసుకుంటూ ఉంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ ‘9999’ ఉండేలా చూసుకుంటూ ఉంటాడు. దీనికోసం ఎంత ఖర్చు చేయడానికైనా రెడీగా ఉంటాడట. ఇలా సినీ ఇండస్ట్రీలో చాలా మందికి ఒక్కో నంబర్ సెంటిమెంట్ గా ఉంటుంది. ఇక బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కి కూడా నెంబర్ సెంటిమెంట్ ఉంది. షారుఖ్ కారు లేదా బైక్ ఏది చూసినా దాని రిజిస్ట్రేషన్ నెంబర్ ఖచ్చితంగా ‘555’ అనే నెంబర్ ఉంటుంది. అంతేకాకుండా ఆ నంబర్ ఉన్న వెహికల్స్ షారుఖ్ ఖానే స్వయంగా నడుపుతారట. నిజానికి వెహికల్స్ విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో సెంటిమెంట్. కొందరు బ్రాండ్ ని సెంటుమెంట్ గా చూస్తారు.. ఇంకొందరు ఇదే రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రమే తీసుకుంటారు. అలా షారుఖ్ తన దగ్గర ఉండే కార్లకు 555 సంఖ్య ఉండేలా చూసుకుంటారు. వేరే నెంబర్ ఉన్న కార్ అయితే మాత్రం తన డ్రైవర్ నడపాల్సిందేనట.
Please Read Disclaimer