కింగ్ ఖాన్ డాటర్ థియేటర్ ప్రాక్టీస్ ఇదిగో

0

బాలీవుడ్ లో నటవారసురాళ్ల వెల్లువ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. జాన్వీ-సారా అలీఖాన్-అనన్య పాండే .. ఈ లిస్ట్ లో ఇప్పటికే సుహానా పేరు చేరింది. కింగ్ ఖాన్ లెగసీని ముందుకు నడిపించేందుకు ప్రస్తుతం స్టార్ డాటర్ ప్రిపరేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. రేపో మాపో డెబ్యూ సినిమా ప్రకటన వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే కథానాయిక అయ్యేందుకు సుహానా ఎలాంటి ప్రిపరేషన్ సాగిస్తోంది? అని ప్రశ్నిస్తే .. అందుకు ఇదిగో ఈ ఫోటో కంటే ఎగ్జాంపుల్ వేరొకటి అవసరం లేదు.

స్కూల్.. కాలేజ్ లో ఉన్నప్పుడు రకరకాల థియేటర్ డ్రామాల్లో నటించింది. స్టేజీ ఆర్టిస్టుగా అనుభవం ఘడించింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇంతకుముందు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు రెండో దశలో ప్రవేశించింది. సుహానా సీరియస్ గా న్యూయార్క్ ఫిలింఇనిస్టిట్యూట్ లో శిక్షణ పొందుతోంది. నటన- దర్శకత్వం రెండు విభాగాల్లోనూ ట్రైనింగ్ అవుతోంది. తాజాగా న్యూయార్క్ ప్లే స్కూల్లో ఇదిగో ఇలా స్టేజీ డ్రామాపై ఆర్టిస్టుగా ప్రాక్టీస్ చేస్తోంది. తనతో పాటు ప్లే మేట్స్ కూడా అంతే కాన్ సన్ ట్రేటెడ్ గా కనిపిస్తున్నారు. సుహానా ఈ ఫోటోలో వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ డ్రెస్ లో కనిపించింది. తలకు హ్యాట్ ధరించి కామిక్ ఎక్స్ ప్రెషన్ తో ఆకట్టుకుంది. ఈ ఫోటో చూస్తుంటే నటన అనే వృత్తి పట్ల తను ఎంత ప్యాషనేట్ గా ఉందో.. ఎంత డెడికేటెడ్ గా ఉందో అర్థమవుతోంది. ఇక తనను ఇలా చూసిన నెటిజుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. వంద శాతం ప్రొఫెషనలిజం చూపిస్తూ డెడికేషన్ చూపిస్తోంది సుహానా! అంటూ అంతా పొగిడేస్తున్నారు. నటవారసురాళ్లు ఎంత మంది ఉన్నా అందరినీ డామినేట్ చేసేందుకు కింగ్ ఖాన్ సుహానా దూసుకొస్తోంది అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

బాలీవుడ్ ని దశాబ్ధాల పాటు ఏలిన కింగ్ ఖాన్ పేరును నిలబెట్టేందుకు లెగసీని ముందుకు తీసుకెళ్లేందుకు సుహానా పక్కాగా ప్రిపేరవుతోంది. భవిష్యత్ లో తను ఏం చేయబోతోంది? అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఈ ఫోటో చూశాక .. సుహానా నటిగా దూసుకుపోయే ఛాన్సులు ఎక్కువే అంటూ అభిమానులు ఎంతో ఎంకరేజింగ్ గా మాట్లాడడం చూస్తుంటే .. తాను ఇంకా స్టార్ కాకముందే ఎంత ఫాలోయింగ్ సంపాదించుకుంటుందో అర్థమవుతోంది.

 

View this post on Instagram

 

Baby 💞 @suhanakhanteam

A post shared by SuhanaKhan2 (@suhanakhanteam) on
Please Read Disclaimer