అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న బాద్షా!

0

కొంతకాలం క్రితం వరకూ షారూఖ్ ఖాన్ అంటే చాలా కింగ్ ఖాన్ అని.. బాలీవుడ్ బాద్షా అని చాలా రకాల బిరుదులతో పిలిచేవారు కానీ ఇప్పుడు మాత్రం షారూఖ్ లో అంత జోరు లేదు. ముఖ్యంగా ‘జీరో’ పరాజయం షారూఖ్ ను పూర్తిగా నిరాశపరిచింది. జీరో కు ముందు కూడా వరస ఫ్లాపులే. ఈ ఫ్లాపులతో షారూఖ్ ఎలాంటి సినిమాలు చేయాలా అనే సందిగ్ధంలో పడిపోయారు. కొత్త సినిమా ఇంకా ప్రారంభం కాకపోవడంతో తన కుటుంబంతో సమయం గడుపుతూ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారు.

ప్రస్తుతం షారూఖ్ అమెరికా ట్రిప్ లో ఉన్నారు. లాస్ ఏంజెలెస్ నుండి కొన్ని ఫోటోలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఒక ఫోటోలో ఈతకొలను దగ్గర కూర్చుని ఉన్నారు. మరో ఫోటోలో గోడకు ఆనుకున్ని నిలుచున్నారు. ఇంకో ఫోటోలో బిలియర్డ్స్ టేబుల్ పై చేతులు పెట్టి స్టైలిష్ గా పోజిచ్చారు. ఈ ఫోటోలే కాకుండా ఒక అభిమానితో కలిసి ఉన్న ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోల్లో ఎప్పటిలాగే షారూఖ్ యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు.

షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ప్రస్తుతం న్యూయార్క్ లోని ఒక యూనివర్సిటీలో ఫిలిం స్టడీస్ కి సంబంధించిన కోర్స్ చేస్తోంది. ఈ కోర్సు పూర్తయిన తర్వాత సుహానా హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందనే ఊహాగానాలు ఉన్నాయి. షారూఖ్.. సతీమణి గౌరీ ఇద్దరూ సుహానాతో సమయం గడపడం కోసమే న్యూయార్క్ ట్రిప్ వేసుకున్నారని అంటున్నారు.
Please Read Disclaimer