కూల్ అండ్ స్టైలిష్ లుక్ లో శర్వా…!

0

యువ హీరో శర్వానంద్ చిన్న చిన్న పాత్రలతో సినీ కెరీర్ స్టార్ చేసి ప్రస్తుతం హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ‘గమ్యం’ ‘ప్రస్థానం’ ‘అందరి బంధువయా’ ‘రన్ రాజా రన్’ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ‘ఎక్సప్రెస్ రాజా’ ‘శతమానం భవతి’ ‘మహానుభావుడు’ సినిమాలతో వర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా విభిన్నమైన చిత్రాలను విలక్షణమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ కెరీర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు. ‘పడి పడి లేచే మనసు’ ‘రణ రంగం’ ‘జాను’ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఈసారి సాలిడ్ హిట్ హిట్ కొట్టాలని కసితో వర్క్ చేస్తున్నాడు. తాజాగా ఓ ఫోటోషూట్ చేసిన శర్వానంద్.. ట్విట్టర్ వేదికగా ఫోటోలను షేర్ చేశాడు.

శర్వానంద్ ఈ ఫోటోలలో కూల్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ట్రెండీ అవుట్ ఫిట్స్ ధరించి లావిష్ లుక్ లో ఉన్న శర్వా ఫోటోలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలలో షేర్ చేస్తున్నారు. శర్వా ప్రస్తుతం బి. కిషోర్ రెడ్డి అనే డెబ్యూ డైరెక్టర్ తో ‘శ్రీకారం’ సినిమా చేస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రామ్ ఆచంట – గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇదే క్రమంలో ఎస్.ఆర్ ప్రభు నిర్మాణంలో శ్రీ కార్తీక్ దర్శకత్వంలో ఓ తెలుగు తమిళ ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. వీటితో పాటు అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ చిత్రాన్ని ప్రకటించాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించనున్న ఈ సినిమాలో బొమ్మరిల్లు సిద్దార్థ్ కూడా నటించనున్నాడు. ఇటీవల కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ అనే చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. ఇలా వరుస సినిమాలు లైన్లో పెడుతూ దూసుకుపోతున్నాడు శర్వానంద్.