రణరంగం రొమాన్స్ సూపర్ గా ఉన్నట్టుందే!

0

సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్.. కాజల్ అగర్వాల్.. కళ్యాణి ప్రియదర్శన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘రణరంగం’. రిలీజ్ కు నెలరోజులే ఉండడంతో ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకుంటున్నాయి. ఈమధ్యే టీజర్ ను.. ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘సీతాకళ్యాణం’ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుండి మరో లిరికల్ సాంగ్ ను విడుదల చేసేందుకు ‘రణరంగం’ టీమ్ రెడీ అవుతోంది.

జూలై 20 వ తారీఖున సాయంత్రం 04:05 గం. లకు ‘కన్నుకొట్టి’ అంటూ సాగే పాట ను విడుదల చేస్తామని తెలుపుతూ ఒక బ్యూటిఫుల్ పోస్టర్ ను విడుదల చేశారు. ‘కన్నుకొట్టు’అనగానే రొమాంటిక్ సాంగ్ అని అర్థం అయిందిగా.. అదే విషయం పోస్టర్లో కూడా కన్ఫాం అయింది. పోస్టర్ లో యంగ్ లుక్ లో ఉన్న శర్వానంద్ ప్రేమలో పడి.. ఆ ఫీల్ కు మురిసిపోయి సిగ్గుపడుతున్నట్టుగా ఓ ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. వెనక కళ్యాణి ప్రియదర్శన్ లంగా ఓణీ ధరించి తలలో పూలు తురుముకొని సూపర్ క్యూట్ గా నవ్వుతోంది. మరి కన్ను ఎవరికి ఎవరు కొట్టారో.. శర్వా అందుకు అలా సిగ్గుపడుతున్నాడో పాట రిలీజ్ అయితే కానీ తెలీదు.

‘రణరంగం’లో శర్వా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు. యువకుడిగా.. మధ్యవయస్కుడైన డాన్ గా డిఫరెంట్ షేడ్స్ లో శర్వా నటన సినిమాకే హైలైట్ అవుతుందనే టాక్ ఉంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడు ప్రశాంత్ పిళ్ళై. ఈ సినిమాను ఆగష్టు 15 వ తారీఖున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Please Read Disclaimer