శర్వానంద్ కొత్త సినిమా షురూ

0

పడి పడి లేచే మనసు తర్వాత ఆరు నెలల గ్యాప్ తీసుకున్న శర్వానంద్ ఇటీవలే రణరంగంతో పలకరించాడు కానీ దాని ఫలితం ఆశించిన మేర రాకపోయినా తన పెర్ఫార్మన్స్ వరకు అభిమానులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం 96 రీమేక్ తో పాటు శ్రీకారం పారరల్ గా చేస్తున్న శర్వా ఇవాళ మరో కొత్త సినిమా మొదలుపెట్టేశాడు. శ్రీకార్తిక్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్ గా డ్రీం వారియర్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

మరో విశేషం ఏంటంటే డైరెక్టర్ కం యాక్టర్ తరుణ్ భాస్కర్ దీనికి సంభాషణలు అందించడం. జేక్స్ బెజోయ్ సంగీతం సుజిత్ సారంగ్ ఛాయాగ్రహణంతో మంచి టెక్నికల్ టీం దీనికి వర్క్ చేయబోతోంది. కొంత కాలం క్రితం ఈ స్క్రిప్ట్ విన్న శర్వానంద్ కు ఇది వన్ సిటింగ్ లోనే విపరీతంగా నచ్చేయడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. వచ్చే ఏడాది సమ్మర్ లో దీన్ని విడుదల చేసేందుకు ప్లానింగ్ చేస్తున్నారు.

శర్వా సెట్స్ మీద ఉంచిన మూడు సినిమాల్లో రెండు డెబ్యు దర్శకులవి కావడం విశేషం. మూడోది కూడా టాలీవుడ్ పరంగా 96 దర్శకుడు ప్రేమ్ కుమార్ కు మొదటి సినిమానే. ప్రయోగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ నటన పరంగా ఛాలెంజ్ అనిపించే పాత్రలను ఎంచుకునే శర్వానంద్ ఇప్పుడీ సబ్జెక్టులో ఎలాంటి జోనర్ ను టచ్ చేయబోతున్నాడో ప్రస్తుతానికి సస్పెన్స్. నాజర్ – వెన్నెల కిషోర్ – ప్రియదర్శి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇవాళ పూజా కార్యక్రమాలు పూర్తి చేసిన టీం రెగ్యులర్ షూటింగ్ కు ఎప్పుడు వెళ్ళేది త్వరలో వెల్లడించనున్నారు
Please Read Disclaimer