డాక్టర్ మీకు రుణపడి ఉంటాను!-శర్వా

0

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఇటీవల సెట్స్ లో గాయపడిన సంగతి తెలిసిందే. థాయ్ ల్యాండ్ లో స్కై డైవింగ్ శిక్షణ తీసుకుంటున్నప్పుడు పైనుంచి కింద పడడంతో భుజం ఎముక కదిలిందని హైదరాబాద్ సన్ షైన్ డాక్టర్లు నిర్ధారించారు. వెంటనే ఆపరేషన్ నిర్వహించి అతడిని తిరిగి యథాస్థితికి తీసుకొచ్చేందుకు 11 గం.ల పాటు శ్రమించిన సంగతి తెలిసిందే.

ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన శర్వానంద్ ప్రస్తుతం పూర్తిగా కోలుకుంటున్నారు. అయితే శర్వా భుజానికి అయిన గాయమేమీ చిన్నది కాదు. అది కాస్తంత సీరియస్ నెస్ ఉన్న గాయమేనని అప్పట్లో వైద్యులు తెలిపారు. అందుకే వెంటనే చికిత్స చేసి సరి చేశారు. అలాంటి క్లిష్ట సన్నివేశంలో తనను తిరిగి మామూలు మనిషిని చేసిన డాక్టర్ కి శర్వా కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ గురవారెడ్డి ఆధ్వర్యంలో చికిత్స విజయవంతం అయినందుకు శర్వా చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. తనను మళ్లీ మామూలు మనిషిని చేసిన డాక్టర్ గురవారెడ్డి- డాక్టర్ ఆదర్శ్ లకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఎమోషనల్ ట్వీట్ చేశారు.

ఆ ఇద్దరు డాక్టర్లు.. అలాగే తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోని శర్వానంద్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. కష్ట కాలంలో తాను క్షేమంగా ఉండాలని కోరుకున్న అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపారు. శర్వా నటించిన రణరంగం త్వరలో రిలీజ్ కానుంది. ఆ సినిమా డబ్బింగ్ పూర్తి చేసేందుకు శర్వా రెడీ కావాల్సి ఉంది. అలాగే 96 చిత్రీకరణలో పాల్గొనేందుకు కొంత సమయం పట్టొచ్చని యూనిట్ భావిస్తోంది. శర్వా గాయం నయమైనా.. మరికొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు.
Please Read Disclaimer