ప్రభాస్ ఫ్రెండ్స్ తో కలిసి మరో సినిమా చేయబోతున్న శర్వా…?

0

సినీ ఇండస్ట్రీలో శర్వానంద్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ చేసి ఇప్పుడు హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. సినీ బ్యాగ్రౌండ్.. ఎవరి అండదండలు లేకుండానే శర్వానంద్ ఇండస్ట్రీలో హీరోగా పాపులారిటీని సాధించాడు. కమర్షియల్ హీరో అన్న ఇమేక్ కోసం పాకులాడకుండా శర్వానంద్ విలక్షణమైన పాత్రలను విభిన్నమైన చిత్రాలను సెలెక్ట్ చేసుకుంటూ వరుస సినిమాతో దూసుకుపోతున్నాడు. ‘గమ్యం’ ‘ప్రస్థానం’ ‘అందరి బంధువయా’ ‘రన్ రాజా రన్’ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ‘ఎక్సప్రెస్ రాజా’ ‘శతమానం భవతి’ ‘మహానుభావుడు’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అయితే కొంతకాలంగా శర్వానంద్ వరుస పరాజయాలను ఎదుర్కుంటూ వస్తున్నాడు. ‘పడి పడి లేచే మనసు’ ‘రణ రంగం’ ‘జాను’ చిత్రాలు ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో తదుపరి సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు శర్వా. ఈ క్రమంలో ‘శ్రీకారం’ అనే సినిమాకి శ్రీకారం చుట్టాడు. ఈ చిత్రానికి కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా 14 రీల్స్ రామ్ ఆచంట – గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కంప్లీట్ అవ్వగా థియేటర్స్ ఓపెన్ అయ్యాక రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

అంతేకాకుండా ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్న యువీ క్రియేషన్స్ బ్యానర్ లో శర్వానంద్ మరో సినిమా చేయనున్నాడట. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాతో శ్రీరామ్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడట. యువీ క్రియేషన్స్ బ్యానర్ లో శర్వానంద్ ఇంతకముందు చేసిన ‘రన్ రాజా రన్’ ‘ఎక్సప్రెస్ రాజా’ ‘మహానుభావుడు’ సినిమాలతో మంచి విజయాలని అందుకున్నాడు. ఇప్పుడు నాలుగోసారి ఈ మ్యాజిక్ రిపీట్ అవుతుందని శర్వా ఆశపడుతున్నాడట. కాగా ‘శ్రీకారం’ సినిమా తర్వాత శర్వానంద్ ‘Rx 100’ ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం’లో.. డైరెక్టర్ చందూ మొండేటితో కలిసి ఒక పిరియాడిక్ ప్రేమకథా చిత్రం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాతో పాటు కిషోర్ తిరుమల దర్శకత్వంలో కూడా శర్వా ఒక సినిమా చేయనున్నాడని సమాచారం.
Please Read Disclaimer