డైలామాలో ఉన్న శర్వా

0

కెరీర్ స్టార్టింగ్ నుండి తనకు ఏదైతే ప్లస్ అయిందో ఈసారి అదే మైనస్ అని చెప్తున్నాడు శర్వానంద్. ప్రస్తుతం ‘రణరంగం’ తో థియేటర్స్ లో సందడి చేస్తున్న శర్వా లేటెస్ట్ గా ఈ సినిమా రిజల్ట్ గురించి మాట్లాడాడు. ఒక స్క్రీన్ బేస్డ్ గా స్టైయిలిష్ యాక్షన్ సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో ‘రణరంగం’ చేశామని. అయితే స్క్రీన్ ప్లే కి థ్రిల్ అవుతారని ఊహిస్తే అది రివర్స్ అయిందని అన్నాడు. నా సినిమాలకు ఎప్పుడూ కథ బాగుందనే మాట వింటుంటానని అయితే ఆడియన్స్ నుండి సినిమాలో కథ లేదని ఫీడ్ బ్యాక్ వచ్చింది. సో ఎప్పుడూ ప్లస్ అయ్యే కథ ఈసారి లేకపోవడం మైనస్ అంటున్నారు. అయితే ప్రేక్షకుల నుండి కొంత వరకూ పాజిటీవ్ టాక్ వస్తుంది కానీ రివ్యూస్ మాత్రం ఆనుకున విధంగా రాలేదు. అయినా వారి వృత్తిని గౌవిస్తున్నాను వాళ్ళు రాసినదాంట్లో కూడా లాజిక్ ఉందని చెప్పాడు.

అయితే ప్రేక్షకుల నుండి వచ్చిన టాక్ రివ్యూస్ నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ తో ఫైనల్ రిజల్ట్ ఏంటనేది మాత్రం తెలుసుకోలేని డైలమాలో ఉన్నాడట శర్వా. ఈ సినిమాతో కొంత మాస్ ఇమేజ్ వచ్చింది కదా అని మళ్ళీ అక్కడే స్టిక్ అవ్వనని ఎప్పటికప్పుడు జోనర్స్ మారుస్తానని కూడా మీడియా ముందు చెప్పుకున్నాడు. ఆ ప్రయత్నంలోనే నెక్స్ట్ ’96’ రీమేక్ అలాగే ‘శ్రీకారం’ చేస్తున్నాని తెలిపాడు. ‘శ్రీకారం’ ఒక మంచి కథతో వస్తున్న సినిమా అని చెప్పాడు.

’96’ రీమేక్ సినిమాకు సంబంధించి సగం షూట్ ఫినిష్ చేసిన శర్వా ప్రస్తుతం ‘ శ్రీకారం’ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ రెండు సినిమాలతో మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవాలని చూస్తున్నాడు. మరి ఈ రెండు సినిమాలైనా శర్వాకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకోస్తాయేమో చూడాలి.
Please Read Disclaimer