‘జాను’ కి టైం లేదుగా

0

ఏ సినిమా అయినా జనంలోకి వెళ్ళాలంటే కొద్దిగా టైం పడుతుంది. అందుకే రెండు నెలల ముందే ప్రమోషన్స్ మొదలుపెడుతుంటారు మేకర్స్. అందరూ అదే ప్రాసెస్ ను ఫాలో అవుతుంటారు. కానీ శర్వా సమంత ‘జాను’ విషయంలో అలా జరగలేదు. దిల్ రాజు కి ప్లానింగ్ లేకపోవడమో లేదా అప్పటికప్పుడు అనుకున్న డేట్ కావడం వల్లో తెలియదు కానీ సినిమా ప్రమోషన్స్ జస్ట్ వారం మాత్రమే దొరికింది.

అవును సరిగ్గా వారం రోజుల్లో ‘జాను’ సినిమా థియేటర్స్ లోకి రానుంది. ఈ పాటికే సినిమా వస్తున్న సంగతి అంతా తెలియాలి. పైగా సమంత – శర్వా కి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఉంటారు. వాళ్ళకి సినిమా వస్తుందన్న సంగతే ఇంకా తెలియదు. కేవలం వారం ఉండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచాలి కానీ అలాంటిదేం జరగట్లేదు. నిన్న ట్రైలర్ రిలీజ్ చేసారు. రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు. ఈ రెండు తప్ప మిగతా ప్రమోషన్స్ వ్యవహారం నెమ్మదిగానే ఉంది.

మరి మేకర్స్ ప్లానింగ్ లేకపోవడంతో వారం రోజుల్లో సినిమా జనాల్లోకి వెళ్ళడం ఓపినింగ్ రాబట్టడం కష్టమే అనిపిస్తుంది. మరి అనుభవం ఉన్న నిర్మాతగా దిల్ రాజు దీన్ని ఎలా ఎదుర్కొని కలెక్షన్స్ రాబడతారో చూడాలి.