కథను కాదు.. స్క్రీన్ ప్లేను నమ్మాను!-శర్వానంద్

0

ప్రతిసారీ కథను మాత్రమే నమ్మాల్సిన పని లేదు. ఒక్కోసారి స్క్రీన్ ప్లేను కూడా నమ్మొచ్చు! అని అంటున్నారు వెర్సటైల్ స్టార్ శర్వానంద్. నిజమా ఇది? అంటే `రణరంగం` చిత్రాన్ని స్క్రీన్ ప్లేని నమ్మి నటించానని శర్వా ఓపెన్ గా చెప్పారు. `పడిపడిలేచే మనసు` తరవాత ప్రేక్షకులకు స్క్రీన్ప్లే బేస్డ్ సినిమా చేయాలని యాక్షన్ సినిమా `రణరంగం` చేశానని తెలిపారు. తెలుగులో వచ్చిన బెస్ట్ క్వాలిటీ ఫిల్మ్ రణరంగం అని ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉందని అన్నారు.

రణరంగం చిత్రానికి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అని ప్రశ్నిస్తే.. సురేఖ ఆంటీ ఫోన్ చేసి చాలా అందంగా ఉన్నావ్ అని చెప్పారు. ఇప్పటివరకూ ఈ సినిమాలో చేసిన మాస్ క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు. ఆ పాత్రలో నాకు నేనే నచ్చాను. రెండు షేడ్స్ ఉన్న పాత్రలు చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేశానని అన్నారు. ఫ్లాష్బ్యాక్లో వచ్చే యువకుడి వేషానికి నేను చిరంజీవిగారి ఫ్యాన్గా కనిపిస్తాను కాబట్టి అప్పటి ఘరానా మొగుడు -అల్లుడా మజాకా లోని చిరంజీవి గారి మేనరిజం ప్రయత్నించాను అని తెలిపారు.

ప్రస్థానం .. శతమానం భవతి.. రణరంగం ఇలా శర్వానంద్ ఎంపికలు చూస్తే ప్రతిదీ వైవిధ్యం ఉన్నవే. ఒక్కోసారి అతడి ఎంపికలు ఎంతో వైవిధ్యం అనిపించినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దర్శకుల తప్పిదాల భారాన్ని శర్వానే మోయాల్సి వచ్చిందని చెప్పొచ్చు. తాజాగా రిలీజైన రణరంగం చిత్రానికి క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందనలు వచ్చినా గ్యాంగ్ స్టర్ గా శర్వా నటనకు మాత్రం కాంప్లిమెంట్లు వచ్చాయి.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home