చెయ్యి నొప్పి బాధిస్తున్నా శర్వా కష్టం

0

తనదైన విలక్షణ నటనతో వెర్సటైల్ స్టార్ గా గుర్తింపు పొందారు హీరో శర్వానంద్. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా క్షణం తీరిక లేకుండా ఉన్నారు. పడి పడి లేచే మనసు- రణరంగం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయం సాధించలేదు. అయినా నటుడిగా శర్వాకు మంచి పేరొచ్చింది. `రణరంగం` చిత్రంలో గ్యాంగ్ స్టర్ పాత్రలో అతడి నటప్రదర్శనకు క్రిటిక్స్ నుంచి ప్రశంసలు కురిశాయి. ఎంచుకున్న పాత్ర ఏదైనా వైవిధ్యమైన నటనతో మెప్పిస్తున్న నవతరం స్టార్ గా శర్వాకి ప్రత్యేక గుర్తింపు దక్కింది. ప్రస్తుతం 96 రీమేక్ సహా `శ్రీకారం` అనే చిత్రంలోనూ శర్వానంద్ నటిస్తున్నారు.

ఇటీవలే `శ్రీకారం` తొలి షెడ్యూల్ ప్రారంభమైంది. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంతో కిషోర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ రైతు పాత్రలో నటిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఈ షూటింగ్ కి వెళుతున్నా.. శర్వా చాలానే జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోందట.

విదేశాల్లో స్కైడైవింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా శర్వానంద్ కి గాయమైన సంగతి తెలిసిందే. ఆ యాక్సిడెంట్ శర్వాని చాలానే డిస్ట్రబ్ చేసిందని అర్థమవుతోంది. శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయినా.. గాయం మానేందుకు చాలానే సమయం పడుతోంది. పాత గాయం ఇంకా పూర్తి స్థాయిలో రిలీఫ్ ని ఇవ్వలేదు. దాంతో అతడు చెయ్యి ఎత్తలేని పరిస్థితిలో ఆ నొప్పితోనే షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఓవైపు 96 పెండింగ్ షూటింగ్ ని పూర్తి చేయాల్సి ఉంది. ఈలోగానే `శ్రీకారం` సెట్స్ లో జాయిన్ అయ్యి బిజీగా ఉన్నారు. ఆ మేరకు క్లోజ్ సోర్స్ నుంచి సమాచారం అందింది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home