శర్వా లుక్స్ తోనే చంపేస్తున్నాడు

0

వచ్చే నెల 15న విడుదల కానున్న శర్వానంద్ రణరంగం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పడి పడి లేచే మనసు వచ్చి ఇప్పటికే ఏడు నెలలు దాటేసింది. అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడంతో దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ టీజర్ రెండు ఆడియో సింగిల్స్ ఇప్పటికే హిట్ అయ్యాయి. ఇప్పుడు దీని తాలూకు ఆన్ లొకేషన్ పిక్స్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా శర్వానంద్ గెటప్ చాలా స్పెషల్ గా ఉంది. మాఫియా డాన్ గా వయసు మళ్ళిన తరహాలో జుట్టు గెడ్డం రెండు తెల్లబడి మధ్యలో నల్లగా చాలా డిఫరెంట్ గా అనిపిస్తున్న శర్వా మాడరన్ నాయకుడిగా కనిపిస్తున్నాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడీ పిక్ షూట్ అయిన సీన్ ని కెమెరాలో ప్రివ్యూ చూసుకుంటూ చెక్ చేయడాన్ని బట్టి చూస్తే ఇదేదో శర్వా చేసిన సీరియస్ సీన్ అని అర్థమైపోతుంది

వైజాగ్ లో ఉండే సామాన్య యువకుడు విదేశాల దాకా తన సామ్రాజ్యాన్ని విస్తరించే డాన్ గా ఎలా ఎదిగాడు అనే పాయింట్ తో రూపొందిన రణరంగంలో కాజల్ అగర్వాల్ తో పాటు కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాహో రేస్ లో నుంచి తప్పుకోవడంతో ఆగస్ట్ 15 లాక్ చేసుకున్న రణరంగం మరోసారి ప్రస్థానం తరహాలో శర్వానంద్ నట విశ్వరూపాన్ని చూపించడం ఖాయమని అభిమానుల నమ్మకం. దానికి తగ్గట్టే పోస్టర్లు విజువల్స్ వస్తున్నాయి కాబట్టి సీరియస్ సబ్జెక్టుతో శర్వా గట్టి హిట్టు కొట్టేలాగే ఉన్నాడు.
Please Read Disclaimer