అనుకున్నంతా అయ్యిందిగా శర్వా

0

బ్యాక్ టు బ్యాక్ రెండు వరుస ఫ్లాప్ లు శర్వానంద్ ని తీవ్ర నిరాశకి గురి చేసిన సంగతి తెలిసిందే. పడి పడి లేచే మనసు – రణరంగం.. ఇవి రెండూ తానొకటి ఆశిస్తే ఫలితం వేరొకలా రావడం శర్వాని నిరాశపరిచింది. ఆ క్రమంలోనే ఈసారి ష్యూర్ షాట్ గా హిట్ కొట్టాలన్న కసితో తమిళ బ్లాక్ బస్టర్ 96 రీమేక్ ని ఏరికోరి ఎంపిక చేసుకున్నాడు. దిల్ రాజు లాంటి లక్కీ హ్యాండ్ ఒరిజినల్ మూవీని తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ తో కలిసి ఈ సినిమాని తెరకెక్కిస్తుండడంతో తనకు కలిసొస్తుందనే భావించాడు. కానీ మరోసారి శర్వా అంచనా తలకిందులైంది. ఫలితం తారుమారైంది.

తానొకటి తలిస్తే దైవమొకటి తలచిన చందంగా ఈసారి కూడా శర్వానంద్ ఫ్లాప్ ని ఎదుర్కోవాల్సిన సన్నివేశం కనిపిస్తోంది. శర్వానంద్ నటించిన జాను ఇటీవలే థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓపెనింగులు ఎంతమాత్రం ఆశాజనకంగా లేవు. జాను పై దాదాపు 22 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ సాగింది. అయితే తొలి వీకెండ్ నాటికి కనీసం 5కోట్లు కూడా వసూలు కాకపోవడం నిరాశపరిచింది. తొలి వారంలోనే పరిస్థితి ఇలా ఉంటే రెండో వారం వరకూ జాను థియేటర్లలో నిలుస్తుందా? అన్నది సందిగ్ధమే.

కల్ట్ క్లాసిక్ జోనర్ ని టచ్ చేసేప్పుడే శర్వానంద్ రకరకాలుగా సందేహించానని ఇంతకు ముందు ఇంటర్వ్యూల్లో తెలిపాడు. తమిళంలో విజయ్ సేతుపతి లాంటి గ్రేట్ పెర్ఫామర్ చేసిన పాత్ర లో తాను నటించడం సాహసమేనని అంగీకరించాడు. ఫలితం తారుమారు కాకూడదనే శర్వా ఆశించినా అది సాధ్యపడనే లేదు. ఎలానూ ఫ్లాప్ ఖాయమని తేలింది కాబట్టి.. జాను వైఫల్యానికి అప్పుడే కారణాల్ని వెతికే పనిలో ఉన్నారట. ఇక 96 సినిమాని తమిళ వెర్షన్ లోనే మెజారిటీ ఆడియెన్ చూసేశారు. ఇటీవల అమెజాన్ – నెట్ ఫ్లిక్స్ – హాట్ స్టార్ లాంటివి అన్ని భాషల సినిమాల్ని అందుబాటులోకి తెచ్చేస్తుండడంతో సంచలన విజయం సాధించిన తమిళ క్లాసిక్ హిట్ 96ని మెజారిటీ జనం డిజిటల్లోనే వీక్షించేశారు. దీంతో రీమేక్ మూవీ జాను కోసం జనం థియేటర్లకు తరలి రాలేదని విశ్లేషించారట. ఫీల్ గుడ్ లవ్ స్టోరీనే అయినా.. స్లో ఫేస్ లో సాగే కథనం బోర్ కొట్టించడం మరో మైనస్ అని తేలింది. ప్రస్తుతం శర్వానంద్ శ్రీకారం అనే చిత్రంలో నటిస్తున్నాడు. కనీసం ఈ సినిమా అయినా అతడిని ఫ్లాపుల బారి నుంచి బయటపడేస్తుందేమో చూడాలి.
Please Read Disclaimer