నటిస్తూనే.. దర్శకనిర్మాతగా స్టార్ హీరోయిన్.. మెప్పిస్తుందా..?

0

సౌత్ సినీ ఇండస్ట్రీలో అందంతో పాటు అద్భుతమైన అభినయం కలిగిన హీరోయిన్లు తక్కువగా ఉంటారు. అలాంటి వారి జాబితాలో టాలెంటెడ్ నిత్యమీనన్ కూడా మొదటి వరుసలో ఉంటుంది. అలా మొదలైంది సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ మలయాళ కుట్టి.. తన నటనతో పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అమ్మడు తెలుగులోనే కాదు తమిళంలో కూడా చక్కటి ఆదరణతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే నిత్యామీనన్ గత కొంతకాలంగా కొత్త సినిమాలు సైన్ చేయడం లేదు.. దానికి కారణం ఆమెకు నచ్చిన పాత్రలు రాకపోవడమే అని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ నిజానికి ఈ గ్యాప్ నిత్య కావాలని తీసుకుందట. ఎందుకంటే నిత్యకు దర్శకత్వం వైపు ఆసక్తి ఉందని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది.

ఆ ఆసక్తితోనే లాక్ డౌన్ లో నిత్య రెండు కథలను సిద్ధం చేసుకుందని సమాచారం. అందులో ఓ కథకు నిర్మాత కూడా దొరికాడట. త్వరలోనే ఈ కథతో ఆమె సెట్స్ పైకి వెళుతుందని టాక్. అయితే లాక్ డౌన్ ముందు నిత్య లావుగా ఉండేది. ప్రస్తుతం బరువు తగ్గే పనిలో పడిందట. అంతేగాక తన డ్రీమ్ ప్రాజెక్ట్ డైరెక్ట్ చేసే పనులు కూడా షురూ చేసింది. ఆ సినిమాలో తను నటించడమే కాకుండా దర్శకత్వం చేస్తూ నిర్మాతగా కూడా వ్యవహరించనుందట. ఇక ఆ సినిమాను ఒకే లాంగ్వేజ్ కి పరిమితం చేయకుండా పాన్ సౌత్ ఇండస్ట్రీ ఫిల్మ్ గా రూపొందించే ఆలోచనలో ఉందని ఇండస్ట్రీ టాక్. అంతేగాక ఈ మూవీలో ఒక్కో భాషకి ఒక్కో హీరో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సినీవర్గాలు మాట్లాడుకుంటున్నాయి. నిత్య ఒక్కసారే భారీ బాధ్యతలు ఎత్తుకుందని.. పిట్ట కొంచం కూత ఘనం అంటే ఇదేనేమో.. అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి మరి నిత్య ఎంతవరకు మెప్పిస్తుందో..!
Please Read Disclaimer