అప్పటి నుండి ఈమెకు ఒక్క ఛాన్స్ రాలేదట

0

గత ఏడాది బాలీవుడ్.. కోలీవుడ్.. శాండల్ వుడ్ అలా అన్ని భాష సినీ పరిశ్రమల్లో కూడా మీటూ ఆరోపణలు తీవ్ర స్థాయిలో వచ్చాయి. మొదట ఉత్తరాదిన ప్రారంభం అయిన మీటూ ఉద్యమం మెల్లగా సౌత్ లో కూడా మొదలైంది. సౌత్ లో ముఖ్యంగా సింగర్ చిన్మయి మరియు హీరోయిన్ శృతి హరిహరన్ పేర్లు వినిపించాయి. చిన్మయి ప్రముఖ రచయిత వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేస్తే హీరోయిన్ శృతి హరిహరన్ మాత్రం సౌత్ స్టార్ హీరో అర్జున్ పై సంచలన కామెంట్స్ చేసింది.

హీరో అర్జున్ పై మీటూ ఆరోపణలు చేసిన తర్వాత శృతి కెరీర్ పూర్తిగా మారిపోయిందట. అప్పటి వరకు బిజీగా ఉన్న ఆమె సినీ కెరీర్ ఒక్కసారిగా జీరోకు వచ్చిందట. అర్జున్ పై ఆ విమర్శలు చేసిన తర్వాత ఇప్పటి వరకు తనకు ఒక్క సినిమాలో కూడా ఛాన్స్ రాలేదు అంటూ పేర్కొంది. మీటూ ఆరోపణలు ఎవరైతే చేస్తున్నారో వారికి అవకాశాలు తగ్గుతున్న విషయం శృతితో మరోసారి నిరూపితం అయ్యింది. ఇలా జరుగుతున్న కారణంగా మీటూ ఆరోపణలు చేసేందుకు లీడింగ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ ఎవరు ముందుకు రావడం లేదు అనిపిస్తుంది.

ఇటీవల శృతి హరిహరన్ ఒక చర్చ కార్యక్రమంలో పాల్గొంది. ఆ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మీటూ అనేందుకు సిగ్గు పడాల్సిన అవసరం లేదు. భయపడకుండా ప్రతి ఒక్కరు తమకు జరిగిన అన్యాయంను గొంతు ఎత్తి చెప్పుకోవచ్చు. న్యాయ పోరాటం సాగుతుందని.. మీటూ ఆరోపణలకు సాక్ష్యాలు ఉండవంటూ ఆమె చెప్పుకొచ్చింది. అప్పటి నుండి నాకు ఒక్క సినిమా ఛాన్స్ రాలేదని.. అయినా కూడా నేను బాధపడటం లేదు.

ఈ సమయంలో నేను భర్త పిల్లలతో సంతోషంగా కాలం గడిపాను. ఇటీవల జాతీయ చలన చిత్ర అవార్డు రావడం సంతోషంగా ఉంది. దాంతో అయినా మళ్లీ ఆఫర్లు వస్తాయేమో అని ఎదురు చూస్తున్నానంటూ చెప్పుకొచ్చింది.
Please Read Disclaimer