Templates by BIGtheme NET
Home >> Cinema News >> నా బాడీలో ఎక్కువ ఖర్చు పెట్టింది దానికే..!

నా బాడీలో ఎక్కువ ఖర్చు పెట్టింది దానికే..!


చాలా మంది కథానాయికలు కొన్నిటిని బహిరంగంగా మాట్లాడేందుకు ఇష్టపడరు. కానీ శ్రుతిహాసన్ ఆ తరహా కాదు. ఉన్నది ఉన్నట్టు ముఖంపైనే మాట్లాడేస్తుంది. ఇక తన ముక్కుకు జరిగిన సర్జరీ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బహిరంగంగానే నిజం ఒప్పుకుంది. తాజాగా తన బోయ్ ఫ్రెండ్ శంతనుతో కలిసి సోషల్ మీడియా లైవ్ చాటింగులో పాల్గొన్న శ్రుతికి ఒక వింత ప్రశ్న ఎదురైంది. మీ బాడీలో మీ ముక్కు మీకు ఇష్టమైనదేనా? అంటూ నెటిజన్ చాలా తెలివిగా మెలిక పెడుతూ ప్రశ్నించగా.. ఏమాత్రం తడుముకోకుండా ఎస్ చెప్పింది శ్రుతి.

“అవును.. నా ముక్కు నాకు బాగా ఇష్టం.. ఎందుకంటే నా శరీరంలో నేను ఎక్కువ ఖర్చు చేసింది దాని బాగుకే కదా“ అంటూ నవ్వేసింది శ్రుతి. నిజానికి శ్రుతి ముక్కుకు చిన్నప్పుడు గాయం అవ్వడం తో దానికి సర్జరీ చేయించారు. ప్రమాదంలో గాయానికి లండన్ లో శస్త్ర చికిత్సను చేయించారు. అలాగే కథానాయిక అయ్యాక కూడా శ్రుతి ముక్కును సరి చేయించుకుందన్న ప్రచారం సాగింది.

అయితే తన జీవితంలో జరిగే ఏ విషయాన్ని దాచుకునేందుకు ఇష్టపడని శ్రుతి ప్రతిదీ ఓపెన్ గానే వెల్లడించేస్తోంది. మైఖేల్ కోర్సలే నుంచి విడిపోయాక డిప్రెషన్ లోకి వెళ్లిన శ్రుతి నెమ్మదిగా కోలుకుంటోంది. గత కొంతకాలంగా కొత్త బోయ్ ఫ్రెండ్ శంతను హజారికా లోకంలోనే జీవిస్తోంది ఈ బ్యూటీ. అతడి సాంగత్యంలో అన్నిటినీ మైమరిచిపోతోంది. ఇక కెరీర్ మ్యాటర్ కి వస్తే క్రాక్ – వకీల్ సాబ్ లాంటి బ్లాక్ బస్టర్లతో ఎవరికీ సాధ్యపడని గ్రేట్ కంబ్యాక్ తనకి సాధ్యమైంది. ఇప్పుడు సలార్ లాంటి పాన్ ఇండియా సినిమాలో నటించేస్తూ మరింతగా వేడి పెంచేస్తోంది.