పొద్దున్నే కాఫీతో మొదలెట్టింది!

0

ఉత్తరాది భామ నేహ శర్మ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసి ఉండకపోవచ్చు కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నెటిజన్లకు మాత్రం తెలిసే ఉంటుంది. ఈ భామ రామ్ చరణ్ డెబ్యూ ఫిలిం ‘చిరుత’ లో హీరోయిన్ గా నటించింది. తర్వాత ముంబై ఫ్లైట్ ఎక్కి అక్కడ సెటిల్ అయింది. హీరోయిన్ గా పెద్దగా విజయాలు దక్కలేదు కానీ సోషల్ మీడియాలో గ్లామర్ బాణాలు సంధిస్తూ నెటిజన్ల అభిమానాన్ని చూరగొంది.

ఈ భామకు ఇన్స్టాగ్రామ్ లో 8 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారంటేనే ఎంత క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. తరచుగా ఘాటు ఫోటోలు పోస్ట్ చేస్తూ ఆ అనుచరులను మురిపిస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఒక కత్తిలాంటి ఫోటో పోస్ట్ చేసి “అవును. ఇది మరో కాఫీ సమయం పోస్ట్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. తెలుగు వారికి కమ్ములగారి మంచి కాఫీ తెలుసు కానీ నేహ శర్మగారి హాటు కాఫీ గురించి పెద్దగా తెలియదు. కాఫీ సమయంలో కాఫీతో పాటుగా నేహ కూడా హాటుగా ఉండడం ఇక్కడ విజ్ఞులైన.. సర్వజ్ఞులైన పాఠకులు గుర్తించాల్సిన అంశం. అయినా ఈభామ దుస్తుల షాపింగ్ చేసే సమయంలోనే వేడిగా ఉండే బట్టలు వెతికి మరీ కొనుగోలు చేస్తుందేమో కానీ ఏ డ్రెస్ కూడా కూల్ గా ఉండదు!

ఈ కాఫీ పోస్ట్ కు మంచి కామెంట్లే వచ్చాయి. “అవును.. కాఫీ చాలా హాట్”.. “పొద్దున్నే మొదలుపెట్టావా పాపా”.. “ఉదయమే కాదు.. 24X7 నువ్వు హాట్” ఇలా కళాపిపాసులు తమ హృదయస్పందనలు తెలిపారు. ఇక నేహ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ‘తైష్’ అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది.
Please Read Disclaimer