స్మైల్ తో మనసు దోచేసిందన్న మెగాస్టార్

0

పబ్లిక్ ఫంక్షన్ల లో మెగాస్టార్ చిరంజీవి ఎవరిపైనా వ్యక్తిగతంగా కామెంట్లు చేయరన్నది అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఆయన తన పంథాకు భిన్నంగా వ్యవహరించి అందరికి షాకిచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఈ మంగళవారం రాత్రి యంగ్ హీరో నిఖిల్ నటించిన `అర్జున్ సురవరం` ప్రీరిలీజ్ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా హాజరై హంగామా చేశారు. ఈ చిత్రంలో నిఖిల్ కు జోడీగా నటించిన లావణ్య త్రిపాఠిపై కామెంట్లు చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఏ ఫంక్షన్కి వెళ్లినా హీరోయిన్లని వ్యక్తిగతంగా కామెంట్ చేయని మెగాస్టార్ తొలిసారి లావణ్యని కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న చిరంజీవి హీరోయిన్ లావణ్య త్రిపాఠి నవ్వు పై కామెంట్ చేశారు. ఆమె నవ్వంటే తనకు చాలా ఇష్టమని.. ఆమె నవ్వితే బుగ్గపై పడే సొట్ట అంటే మరీ ఇష్టపడతానని తన మనసులో మాట బయటపెట్టేశారు. `భలే భలే మగాడివోయ్` చిత్రం లో లావణ్యని మారుతి చాలా అందంగా చూపించాడని ఈ సందర్భంగా గుర్తు చేశారు. `అర్జున్ సురవరం` చిత్రానికి లావణ్య నటన ఆమె ప్రజెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని స్పష్టం చేయడంతో లావణ్య ఆనందానికి హద్దులు లేకుండా పోయాయట.

అయితే సీనియర్ హీరోలు ఇలాంటి కామెంట్లు చేయడం అన్నది ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు ఏఎన్నార్ అంతటి హీరో అందాల కథానాయికలపై సరదాగా నవ్వేస్తూ చిరు లానే కామెంట్ చేసిన సందర్భాలున్నాయి. ఫ్లోలో సరదాగా మాట్లాడేస్తూ ఇలా అనేయడం కేవలం నవతరంలో ఊపు తెచ్చేందుకే అనే వాళ్లు ఉన్నారు. అయితే సోషల్ మీడియా కల్చర్ లో కొన్నిసార్లు ట్రోల్స్ ఎదురవుతున్నాయి.
Please Read Disclaimer