‘మస్కా’ కొట్టి రెడ్డిని పెళ్లాడేసింది

0

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ముద్దుగుమ్మ షీలా గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే. ఈ అమ్మడు తెలుగు.. తమిళం.. కన్నడం భాషల్లో మొత్తంగా 24 చిత్రాలు చేసింది. గత నాలుగు అయిదు సంవత్సరాలుగా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న ఈ అమ్మడు ఎట్టకేలకు పెళ్లి పీఠలు ఎక్కేసింది. సినిమాల్లో ఛాన్స్ లు లేని వారు ఇలా పెళ్లి పీఠలు ఎక్కడం మనం కామన్ గానే చూస్తూ ఉన్నాం. కాని ఈ అమ్మడు సినిమాలు మానేసిన ఇన్నాళ్లకు పెళ్లి చేసుకుంది.

సంతోష్ రెడ్డితో షీలా వివాహం చెన్నైలో వైభవంగా జరిగింది. సినిమా పరిశ్రమకు చెందిన వారు ఎవరు కూడా ఈ వేడుకలో పాల్గొనలేదు. ఇద్దరి బంధువులు మిత్రులు ఆప్తులు మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరైనట్లుగా సమాచారం అందుతోంది. సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయిన కారణంగా షీలా ఇండస్ట్రీ వారిని ఎవరు పిలవలేదని తెలుస్తోంది.

తెలుగులో ఈ అమ్మడు అల్లు అర్జున్ తో పరుగు.. ఎన్టీఆర్ తో అదుర్స్.. రామ్ తో మస్కా.. బాలయ్యతో పరమవీర చక్ర చిత్రాలతో పాటు ఇంకా పలు చిన్నా పెద్ద చిత్రాల్లో నటించింది. తెలుగులో పెద్ద హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్నా కూడా ఈ అమ్మడికి లక్ మాత్రం కలిసి రాలేదు. ఈమె కెరీర్ తక్కువ సమయంకే ముగిసింది. అయినా కూడా షీలా ప్రేక్షకులకు గుర్తుండి పోయింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-