సంగీత దర్శకుడికి చుక్కలు చూపిన ఫైవ్ స్టార్ హోటల్

0

త్రీ స్టార్.. ఫైవ్ స్టార్ అంటూ హోటల్స్ వారు భారీగా రేట్లు పెడుతున్నారు. ఫుడ్ లో క్వాలిటీ ఉన్నా లేకున్నా వారు వేసే బిల్లును చచ్చినట్లు కట్టాల్సిందే. ఆమద్య బాలీవుడ్ నటుడికి ఒక ఫైవ్ స్టార్ హోటల్ రెండు అరటి పండ్లకు గాను 442 రూపాయల బిల్లు వేసింది. ఆ విషయం చాలా పెద్ద చర్చకు తెర తీసింది. ఆ నటుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ట్యాక్స్ డిపార్ట్ మెంట్ వారు ఆ హోటల్ కు పాతిక వేల రూపాయల జరిమాన విధించడం జరిగింది. ఆ సంఘటన మర్చి పోక ముందే మరో సంఘటన జరిగింది.

బాలీవుడ్ సంగీత దర్శకుడు శేఖర్ రావూజీ గుజరాత్ అహ్మదాబాద్ లోని హోటల్ హయత్ రెజెన్సీ లో మూడు వైట్ ఎగ్ లతో రైస్ ఆర్డర్ ఇచ్చాడు. మూడు ఎగ్స్ తో రైస్ కు నార్మల్ గా అయితే 500 రూపాయలకు అటు ఇటు అవుతుంది. కాని హయత్ రెజెన్సీ మాత్రం ఏకంగా 1672 రూపాయల బిల్ వచ్చింది. ఆ బిల్లు చూసి షాక్ అయిన శేఖర్ రావూజీ మొదట ఆశ్చర్య పోయాడు ఆ తర్వాత ఆ బిల్లును ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

మూడు కోడుగుడ్లతో కూడిన రైస్ కు రూ.1350 కాగా అదనంగా సర్వీస్ చార్జ్ 5 శాతం చొప్పున 67 రూపాయలు సీజీఎస్టీ 9 శాతం 127 రూపాయలు కాగా ఎస్ జీఎస్టీ 9 శాతం 127 రూపాయలు అయ్యింది. మొత్తం కలిపి 1672 రూపాయలు అయ్యింది. శేఖర్ రావూజీ చేసిన పోస్ట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. ఫైవ్ స్టార్ హోటల్స్ అంటూ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇలాంటి హోటల్స్ పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు
Please Read Disclaimer