ఆమె కమర్షియల్ ఈమె సో స్వీట్

0

ఆ ఇద్దరూ అగ్ర కథానాయికలు. ఒకరితో ఒకరు పోటీపడుతూ దశాబ్ధంపైగానే కెరీర్ ని సాగించారు. సౌత్ లో అగ్ర కథానాయికలుగా రాణించారు. అయితే ఆ ఇద్దరికీ ఒకటే తేడా. ఒకరు ధనార్జన విషయంలో బిజినెస్ లో ఏమాత్రం తగ్గరు. మరొకరు స్నేహం కోసం లేదా గౌరవం కొద్దీ ఎదుటివారికి విలువనిచ్చి నటించేందుకు అయినా ముందుకొస్తారు. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరు? అంటే.. అందులో ఒక పేరు నయనతార. ఇంకో పేరు స్వీటీ అనుష్క శెట్టి.

ఇటీవలే రిలీజైన `సైరా- నరసింహారెడ్డి`లో నయన్- అనుష్క నటనకు పేరొచ్చింది. ఈ చిత్రంలో నటించినందుకు అందాల నయనతార ఏకంగా 6కోట్ల పారితోషికం అందుకున్నారని ప్రచారమైంది. నయన్ కి మరీ అంత ముట్టజెప్పారా? కొణిదెల ప్రొడక్షన్స్ అంత సమర్పించుకునేందుకు డేర్ చేసిందా! అంటూ మాట్లాడుకున్నారు. నయనతారలో కమర్షియల్ యాంగిల్ పైనా చర్చ సాగింది. అయితే తాజాగా మరో ఆసక్తికర సంగతి రివీలైంది. సైరా నరసింహారెడ్డి సినిమాలో ఉయ్యాలవాడను పరిచయం చేసే ఝాన్సీలక్ష్మీ భాయ్ పాత్రలో స్వీటీ అనుష్క నటించిన సంగతి తెలిసిందే.

అయితే ఆ విషయాన్ని సైరా టీమ్ చివరివరకూ దాచి ఉంచింది. సినిమాలో చూసి సర్ ప్రైజ్ అవ్వాలనే రివీల్ చేయలేదు. అంతేకాదు.. స్వీటీ ఆ పాత్రలో నటించినందుకు ఎంత పారితోషికం అందుకుంది? అంటే అసలు ఎలాంటి పారితోషికం లేకుండానే కేవలం చిరుపై గౌరవంతో నటించిందని తెలుస్తోంది. అదొక్కటేనా.. అనుష్క అమెరికా నుంచి సొంతంగా విమానం టిక్కెట్లు బుక్ చేసుకుని సొంత ఖర్చులతో వచ్చి నటించేసి వెళ్లిపోయింది. అందుకోసం పైసా పారితోషికం కూడా డిమాండ్ చేయలేదట. స్వీటీ మాట తీరు మాత్రమే వెన్న అనుకుంటే పొరపాటే మనసు కూడా అంతే స్వీట్ అనేందుకు ఇంతకంటే ఎగ్జాంపుల్ కావాలా? అందుకే పరిశ్రమలో దశాబ్ధంన్నర పాటు ఎదురే లేకుండా కెరీర్ ని సాగించింది. అందుకే ఆమె కమర్షియల్.. ఈమె స్వీట్ అన్నది అందుకే. ఈ చిత్రంలో నటించిన అమితాబ్ బచ్చన్ సైతం పారితోషికం లేకుండా చిరుతో ఉన్న స్నేహం కొద్దీ నటించారు.
Please Read Disclaimer