సొంత చెల్లెల్ని చంపాలని చూస్తున్న నాటి హీరోయిన్!

0

యువరాజు.. శివరామరాజు.. ఇద్దరు మిత్రులు సినిమాలు గుర్తున్నాయా? ఈ సినిమాలన్నింటిలోనూ కామన్ పాయింట్ సాక్షి శివానంద్. చలాకీగా కనిపించే ఈ చాక్లెట్ భామ గడిచిన కొద్దిరోజులుగా యాక్టింగ్ కు దూరంగా ఉండటం తెలిసిందే. చిరంజీవి.. మహేశ్ లాంటి అగ్రతారలతో నటించిన ఈ భామ గురించి ఆమె సొంత చెల్లెలే షాకింగ్ ఆరోపణలు చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.

తన అక్క సాక్షి శివానంద్ తనను చంపాలని చూస్తున్నట్లుగా వెల్లడించారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సాక్షి శివానంద్ సోదరి శిల్పా శివానంద్ సైతం నటిగా సినిమాల్లోనూ.. టీవీ సీరియల్స్ లోనూ నటించారు. తెలుగులో ఆమె మంచు విష్ణు నటించిన విష్ణు మూవీలో నటించారు. తన మీద ఉన్న బీమా సొమ్మును సొంతం చేసుకోవటం కోసం సాక్షి తనను చంపే ప్రయత్నం చేసిందన్నారు.

తన అక్క పెళ్లాడిన భర్త తల్లి భావన గురించి ఆమె భారీ ఆరోపణ చేసింది. ఆమె తన భర్తను గతంలో చంపిందన్నారు. బీమా డబ్బు కోసం నన్ను.. నా తల్లిని కూడా చంపాలనుకుంటుందని.. అందుకు తన సోదరి సాయం చేస్తుందన్నారు. పోలీసులు ఎక్కడ పట్టుకుంటారో అన్న భయంతో భావన అమెరికాకు పారిపోయిందని.. ఆమె ఎప్పుడు స్వదేశానికి తిరిగి వస్తే ఆ వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుంటారని పేర్కొంది.

అంతేకాదు.. తన బెస్ట్ ఫ్రెండే తనను రేప్ చేయించటానికి కూడా పురమాయించినట్లు పేర్కొంది. సొంత అక్క తనను ఇంటి నుంచి తరిమేసిందని.. ఈ విషయంలో తనకు తెలిసిన వారు.. తన అభిమానులు సాయం చేయాలని కోరింది. మరీ వ్యవహారంపై సాక్షి శివానంద్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Please Read Disclaimer