బిగ్ బాస్ 3 లో ఆ సెంటిమెంట్ మళ్లీ రిపీట్

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 గత రెండు సీజన్ ల మాదిరిగా ఆకట్టుకోలేక పోతుంది అనేది సోషల్ మీడియా కామెంట్స్. కంటెస్టెంట్స్ అంతా కూడా చాలా సేఫ్ గేమ్ ఆడటంతో పాటు టాస్క్ ల విషయంలో చాలా బద్దకంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే సీజన్ 3 కి తక్కువ రేటింగ్ వస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఎలిమినేషన్స్ విషయంలో ఏమాత్రం ఆసక్తి లేకుండా ముందుగానే తెలిసి పోతుంది. సోమవారం ఎలిమినేషన్ కు నామినేషన్స్ జరిగిన రోజునే ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనే విషయంపై ఊహాగాణాలు వస్తున్నాయి. అన్నట్లుగానే వారే ఎలిమినేట్ అవుతున్నారు.

ఈ సీజన్ లో చూసుకుంటే ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వారిలో ఎక్కువ శాతం మొదటి సారి నామినేట్ అవ్వగానే ఎలిమినేట్ అయిన వారే ఉన్నారు. మొదటి వారంలో హేమ మొదటి సారి నామినేట్ అవ్వగానే ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత తమన్నా.. రోహిణి.. అషు.. అలీ ఇలా అయిదుగురు కూడా మొదటి సారి ఎలిమినేషన్స్ లోకి రాగానే వెళ్లి పోయారు. అలాగే ఈ వారం కూడా శిల్పా చక్రవర్తి తన మొదటి ఎలిమినేషన్ నామినేషన్స్ లోనే వెళ్లి పోయింది.

ఎంట్రీ ఇచ్చిన మొదటి వారం ఆమెను నామినేషన్స్ లోకి తీసుకోలేదు. రెండవ వారంలో ఆమెను ఎక్కువ మంది ఎలిమినేషన్ కు నామినేట్ చేయడం జరిగింది. శిల్పా ఎలిమినేషన్స్ లోకి వచ్చిన వెంటనే అంతా కూడా ఆమె ఎలిమినేట్ అవ్వడం ఖాయం అనుకున్నారు. ఇక శుక్రవారం సాయంత్రం నుండే శిల్పా ఎలిమినేట్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. సెంటిమెంట్ ను నిజం చేస్తూ నాగార్జును నిన్నటి ఎపిసోడ్ లో శిల్పాను ఎలిమినేట్ చేయడం జరిగింది.

రెండు వారాల జర్నీ స్వీట్ అండ్ షార్ట్ అంటూ శిల్పా బయటకు వచ్చింది. మరి కొన్ని రోజులు ఉంటే బాగుండేదన్న శిల్పా ఇంట్లోని ప్రతి ఒక్కరిపై చాలా పాజిటివ్ గా స్పందించింది. కుక్కలు అరిస్తే స్విమ్మింగ్ పూల్ లో దూకడం అనే బిగ్ బాంబ్ ను మహేష్ విట్టాపై వేసి ప్రేక్షకులకు గుడ్ బై చెప్పి శిల్పా వెళ్లి పోయింది. ప్రస్తుతం ఇంట్లో ఇంకా పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.
Please Read Disclaimer