ఈ వయసు లోనూ ఏం అందం

0

మాజీ మిస్ ఇండియా కంటెస్టెంట్ విన్నర్.. కింగ్ ఫిషర్ మోడల్ హైదరాబాదీ బ్యూటీ శిల్పా రెడ్డి నాలుగు పదుల వయసులో అడుగు పెట్టినా కూడా అందం ఏమాత్రం తగ్గలేదు. శిల్ప రెడ్డి తాజాగా ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వయసులో కూడా ఫిట్ బాడీతో కండలు కలిగి ఉన్న ఆమెను చూసి అంతా ఆశ్చర్య పోతున్నారు. శిల్పా రెడ్డి హీరోయిన్ రేంజ్ లో ఎక్స్ పోజ్ చేస్తూ ఇచ్చిన ఫోజ్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

ఇప్పటి వరకు వెండి తెరపై ఆసక్తి చూపించని శిల్పా రెడ్డి ఈ ఫొటోను పోస్ట్ చేయడం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే ఆలోచన ఏమైనా చేస్తుందా అంటూ కామెంట్స్ కూడా వస్తున్నాయి. మొత్తానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శిల్పా రెడ్డి ఫొటో సినీ వర్గాల దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. ఆమెకు సూట్ అయ్యే పాత్రలు ఏమైనా ఉంటే తప్పకుండా ఫిల్మ్ మేకర్స్ ఆమెను సంప్రదించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఆమె సినిమాలపై ఆసక్తి ఉందా లేదా అనేది చూడాలి. గతంలో శిల్పా రెడ్డికి సినిమాల్లో ఛాన్స్ లు వచ్చినా ఆమె నో చెప్పిందని సమాచారం. కాని పెద్ద సినిమాల్లో ఆఫర్లు వస్తే ఇప్పుడు ఆమె ఖచ్చితంగా చేయవచ్చు అంటూ టాక్ వినిపిస్తుంది.
Please Read Disclaimer