సాగరకన్య శిల్పా శెట్టి రెబలిజం

0

సాగరకన్యగా కనిపించి రెండు దశాబ్ధాలు దాటినా.. ఇప్పటికీ అదే రూపంతో తెలుగు యువత కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంటుంది శిల్పా శెట్టి. బిజినెస్ మేన్ రాజ్ కుంద్రాను పెళ్లాడి ఇద్దరు పిల్లలకు మామ్ అయినా ఇప్పటికీ పర్ఫెక్ట్ ఫిట్ రూపంతో మైమరిపిస్తూనే ఉన్నారు. ముంబై ఫేజ్ 3 ప్రపంచంలో గ్రీకుదేవతలా వెలిగిపోతున్న శిల్పా శెట్టి ఫిట్నెస్ వీడియోలకు ఉన్న గిరాకీ అంతా ఇంతా కాదు. శిల్పాజీ రూపొందించిన యోగా డీవీడీలు ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో అమ్ముడయ్యాయి. ఇక రెగ్యులర్ ఫిట్నెస్ ఫ్రీక్ గా జిమ్ కి వెళుతూ 44 ఏళ్ల శిల్పా శెట్టి ఇప్పటికీ ఒక టీనేజర్ లా రూపాన్ని మెయింటెయిన్ చేయడం ఆల్వేస్ యూత్ లో హాట్ టాపిక్.

అదంతా సరేకానీ.. తాజాగా ముంబైలోని ఓ ఫిట్నెస్ స్టూడియో నుంచి వస్తూ శిల్పా శెట్టి ఇచ్చిన ఫోజులు హాట్ టాపిక్ గా మారాయి. బుల్లితెర ఫిట్నెస్ క్వీన్ సోఫీ చౌదరి నిర్వహిస్తున్న `వర్క్ ఇట్ అప్` ఫిట్నెస్ షోలో శిల్పా ఎపిసోడ్ ప్రధానంగా హైలైట్ కానుంది. అందుకు సంబంధించిన షూట్ పూర్తయిన వెంటనే ఆ షోని చిత్రీకరించిన ఫిట్నెస్ స్టూడియో నుంచి వస్తూ శిల్పా కెమెరా కంటికి చిక్కింది. శిల్పాజీ ఆ సమయంలో ఒక టీనేజర్ ని తలపించడమే కాదు.. ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా రన్నింగ్ చేస్తూ రకరకాల భంగిమల్లో ఫోజులిస్తూ వేడెక్కించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. సోషల్ మీడియాల్లో జెట్ స్పీడ్ తో వైరల్ అయిపోతున్నాయి.

శిల్పా ధరించిన స్పోర్ట్స్ బ్రాండ్ పై యూత్ ఒకటే ఆరాలు తీస్తున్నారు. అది ఆడిడాస్ బ్రాండా.. నైక్ బ్రాండా లేక రీబాకా? అంటూ బోయ్స్ అంతా గుసగుసలాడేసకుంటున్నారు. శిల్పా శెట్టి ఇటీవలే `నికమ్మ` అనే చిత్రంలో నటిస్తున్నానని ప్రకటించారు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ లో అభిమన్యు దాసాని- షిర్లే సీతియా కీలక పాత్రలు పోషిస్తుండగా షబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. శిల్పాజీకి ఇది 13 ఏళ్ల తర్వాత కంబ్యాక్ మూవీ. తనని తాను నిరంతరం లైమ్ లైట్ లో ఉంచుకునేందుకు ఏదో ఒక ప్రత్యేక ఈవెంట్ తో బుల్లితెరపై కనిపించే శిల్పా శెట్టి తిరిగి ముఖానికి రంగేసుకుని ఆన్ సెట్స్ ప్రత్యక్షమవుతుండడంతో తన సినిమా ఎప్పుడొస్తుందా? అన్న ఉత్కంఠ అభిమానుల్ని నిలవనీయడం లేదు.
Please Read Disclaimer