బిగ్ బాస్: అలీ కంటే శివజ్యోతికి తక్కువ ఓట్లు వచ్చాయా..?

0

బిగ్ బాస్ సీజన్-3 చివరిలో ఆసక్తికర ఎలిమినేషన్ జరిగింది. హౌస్ లో ఉన్న ఆరుగురు సభ్యుల్లో ఈ చివరి వారం శివజ్యోతి ఎలిమినేట్ అయి…మిగిలిన ఐదుగురు ఫినాలేకు చేరుకున్నారు. వీరిలో ఒకరు నెక్ట్స్ వీక్ విన్నర్ గా నిలవనున్నారు. అయితే ఎలిమినేషన్ ప్రక్రియ కంటే ముందు నాగార్జున…ఇంటిలోకి విజయ్ దేవరకొండని గెస్ట్ గా తీసుకొచ్చాడు. మీకు మాత్రమే చెప్తా సినిమా ప్రమోషన్ లో భాగంగా విజయ్…కన్ఫెషన్ రూమ్ కు వెళ్ళి….ఒక్కో సభ్యుడుతో మాట్లాడారు. ఈ 14 వారాల్లో ఇంటిలో ఎవరుకు తెలియని సీక్రెట్ తనకు చెప్పాలని విజయ్ ఒకో కంటెస్టంట్ ని అడిగాడు.

అలాగే వారు ఏవో చిన్న చిన్న సీక్రెట్స్ చెప్పారు. ఆ తర్వాత స్టేజ్ మీదకు వెళ్ళిన విజయ్ – నాగార్జున తో కలిసి ఎలిమినేషన్ లో ఉన్న ఒక సభ్యున్ని సేవ్ చేసే కార్యక్రమం చేశారు. ఎలిమినేషన్ లో మిగిలి ఉన్న శివజ్యోతి – వరుణ్ – అలీల్లో … వరుణ్ సేఫ్ అయ్యాడని ప్రకటించి విజయ్ దేవరకొండ – వాళ్ళ టీం బయటకు వెళ్లిపోయింది. ఇక చివరికి అలీ – శివజ్యోతిల్లో…నాగ్ శివజ్యోతి ఎలిమినేట్ అయిందని ప్రకటించారు. అయితే దీని బట్టి చూస్తుంటే శివజ్యోతి కంటే అలీకి ఎక్కువ ఓట్లు వచ్చి సేఫ్ అయ్యాడు. కానీ బిగ్ బాస్ గేమ్ లో అలీ కంటే శివజ్యోతినే మంచి ప్రదర్శన చేసిందని హౌస్ లో ఉనే సభ్యులే అంగీకరిస్తున్నారు.

వరుణ్ – రాహుల్ లాంటి వారు కూడా శివజ్యోతి విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. పైగా అలీ ఒకసారి ఎలిమినేట్ అయ్యి వైల్డ్ కార్డు ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. దీంతో ప్రేక్షకుల అతని పట్ల అంత పాజిటివ్ గా ఏమీ లేరు. మరి ఏ విధంగా ఓటింగ్ ఎక్కువ వచ్చిందనేది ఆలోచించాల్సిన విషయమే. ఏదేమైనా శివజ్యోతి బయటకు రావడంతో మిగిలిన ఐదుగురు ఫినాలేలో తలపడనున్నారు. మరి వారిలో ఎవరు విన్నర్ గా నిలుస్తారో ? చూడాలి.
Please Read Disclaimer