ఊసరవెల్లి బాబా భాస్కర్..గుంట నక్క మహేశ్..

0

సన్ డే ఫన్ డే అని హోస్ట్ నాగార్జున ఎప్పుడు చెబుతున్నట్లుగానే బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ చాలా సరదాగా సాగింది. నాగార్జున హౌస్ మేట్స్ తో సరదా గేమ్స్ ఆడించారు. అందులో భాగంగా కెప్టెన్ శివజ్యోతికి నాగ్ టాస్క్ ఇచ్చారు. స్టోర్ రూమ్ లో నుంచి తెచ్చిన జంతువుల బొమ్మల మాస్కులని ఒకో హౌస్ మేట్ కి పెట్టాలని నాగ్ సూచించారు. జంతువుల స్వభావాన్ని తాను చదివి వినిపిస్తానని దాని బట్టి ఆ స్వభావం ఎవరికి సరిపోతుందో ఆ మాస్కుని వారికి పెట్టాలని అన్నారు.

దీంతో శివ జ్యోతి మృగరాజు సింహం మాస్కుని అలీకి పెట్టింది. ఆ తర్వాత జిత్తులమారి నక్క మాస్కుని బాబా భాస్కర్ కి – పారిపోయే గుణం గల జింక బొమ్మని రాహుల్ కి పెట్టింది. ఇక అందరి కంటే ఎక్కువ తినే ఏనుగు మాస్క్ హిమజకు – అల్లరి చేష్టలు చేసే కోతి బొమ్మని శ్రీముఖికి పెట్టింది. అయితే రంగులు మార్చే ఊసరవెల్లి బొమ్మని మళ్ళీ బాబా భాస్కర్ కు పెట్టగా – అంతకముందు పెట్టిన నక్కని మహేశ్ కు పెట్టింది.

విశ్వాసం చూపించే కుక్క మాస్క్ రవికు – పగబట్టే పాముగా అషు – నెమ్మదిగా ఉండే తాబేలుగా వరుణ్ – సౌండ్ లేకుండా ఎక్కువ తినే కుందేలు పునర్నవి – గుడ్డి గా వేరే వాళ్ళని ఫాలో అయ్యే గొర్రె పిల్లని వితికాలకు పెట్టింది. ఇక ఈ టాస్క్ అయిపోయాక నాగ్ మరో గేమ్ ఆడించారు. 12 మంది హౌస్ మేట్స్ ని 6 జతలుగా విడదీసి – వారు రివర్స్ క్యారక్టర్ చేయాలని సూచించారు.

బాబా భాస్కర్ – అషురెడ్డి – హిమజ – రవికృష్ణ – శ్రీముఖి – రాహుల్ – మహేష్ – శివజ్యోతి – పునర్నవి – వరుణ్ – వితికా – అలీ జంటలుగా ఏర్పడ్డారు. ఈ జంటలు ఒకరు మరొకరిలా ప్రవర్తించి – వారిలా నటించాలి. అంటే అలీలా వితికా.. వితికాలా అలీ నటించాలన్నమాట. అలా హౌస్ మేట్స్ మొత్తం సరదాగా నటించి ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేశారు.
Please Read Disclaimer