శివన్న పాన్ ఇండియా.. ఈసారి దండయాత్రేనా?

0

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ (శివన్న).. పాన్ ఇండియా స్టార్ కావాలనుకుంటున్నారా? ఇతర హీరోల్లానే సౌత్ అంతటా తన మార్కెట్ రేంజును విస్తరించాలని భావిస్తున్నారా? అంటే అవుననే తాజా యాక్టివిటీస్ చెబుతున్నాయి. ఇక శివ రాజ్ కుమార్ తన తండ్రి.. లెజెండరీ నటుడు రాజ్ కుమార్ నట వారసత్వాన్ని పునికిపుచ్చుకుని కన్నడనాట సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. ఆయన శాండల్ వుడ్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ తో సత్తా చాటుతున్నారు. గత కొంతకాలంగా ఇరుగు పొరుగు భాషలపైనా ఆయన దృష్టి సారిస్తున్నారు. ఇది తాజా మేలిమలుపు అన్న విశ్లేషణ అభిమానుల్లో సాగుతోంది.

శివరాజ్ కుమార్ ఇప్పటికే పలు తెలుగు చిత్రాల్లో మెరిశారు. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన `కిల్లింగ్ వీరప్పన్`… బాలకృష్ణ నటించిన `గౌతమిపుత్ర శాతకర్ణి` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ని పలకరించారు. `గౌతమిపుత్ర శాతకర్ణి`లో శాతకర్ణి కథని చెప్పే బుర్రకథకుడు కాళహస్తీశ్వరుడిగా కాసేపు తనదైన నటనతో ఆకట్టుకుని టాలీవుడ్ ఆడియెన్స్ కి కాస్త దగ్గరయ్యారు. దీంతో ఇప్పుడాయన ద్విభాషా చిత్రానికి ప్లాన్ చేసుకుంటున్నాడట. తెలుగు- కన్నడ భాషల్లో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల భాషా బేధం అనే హద్దులు చెరుపుకుని సౌత్ సినిమా పాన్ ఇండియా సినిమాగా మారుతున్న నేపథ్యంలో శివరాజ్ కుమార్ కూడా భారీ చిత్రాలు చేయాలని భావిస్తున్నారట. అందులో భాగంగానే ఈ బైలింగ్వల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

డెబ్యూ శివ ధూళిపూడి ఇటీవల శివరాజ్ కుమార్ కి పాన్ ఇండియా రేంజ్ కథని నెరేట్ చేశారట. ఈ స్క్రిప్ట్ కి ఆయన ఫిదా అయ్యారట. తన కెరీర్ లో కొత్త తరహా చిత్రమవుతుందని భావించిన శివన్న తెలుగులోకి స్ట్రెయిట్ హీరోగా ఎంట్రీకి ప్లాన్ చేశారట. ఇదే సరైన సమయం .. సరైన ప్రాజెక్ట్ అని భావించి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఇందులో ఆయన గతంలో ఎప్పుడూ కనిపించని విధంగా చాలా కొత్త గెటప్ లో కనిపిస్తారని తెలుస్తోంది. అంతా అనుకున్నట్టే వర్కౌట్ అయితే కచ్చితంగా ఇది కెరీర్ బెస్ట్ సినిమా అవుతుందని శివరాజ్ కుమార్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాని శ్రీకాంత్ ధుళిపూడి- శ్రీనివాస్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ జరుగుతుంది. ఇక ప్రస్తుతం శివరాజ్ కుమార్ కన్నడలో `భజరంగి2`- `ఆర్డీఎక్స్`- `భైరతి రణగళ్లు` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-