నిహారిక సిసలైన `సూర్యకాంతం`- శివాజీ రాజా

0

నిహారిక కథానాయికగా నటిస్తున్న చిత్రం `సూర్యకాంతం`. రాహుల్ విజయ్ కథానాయకుడు. వరుణ్ తేజ్ సమర్పణలో నిర్వాణ సినిమాస్ నిర్మిస్తోంది. ప్రణీత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈనెల 29న సినిమా రిలీజవుతోంది. నేటి సాయంత్రం హైదరాబాద్ జేఆర్సీ సెంటర్ లో ఆడియో వేడుక జరుగుతోంది. ఈ వేదికపై ప్రధాన అతిధిగా విజయ్ దేవరకొండ అటెండ్ అవుతుండగా.. స్పెషల్ గెస్ట్ గా శివాజీ రాజా హాజరవ్వడం ఆసక్తికరం.

నిహారిక కు సూర్యకాంతం టైటిల్ సూటబులా? అని యాంకర్ ప్రశ్నిస్తే పెర్ఫెక్ట్ గా సూటవుతుందని శివాజీ రాజా కితాబిచ్చేశారు. నిహారికి సిసలైన సూర్యకాంతం అంటూ పొగిడేశారు. ఎక్కడ కనిపించినా ఎప్పుడూ అల్లరి పిల్లగా కనిపిస్తుంది. వరుణ్ తేజ్ ఎంతో సాఫ్ట్ గా ఉంటాడు కానీ.. నిహారిక అలా కాదు.. ! అని శివాజీ రాజా తెలిపారు. ఇకపోతే ఇదివరకూ మా ఎన్నికల్లో ఓటమి అనంతరం మెగా బ్రదర్ నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని శివాజీ రాజా సరదాగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే మా అధ్యక్షుడిగా ఓటమి అనంతరం అతడు హాజరైన తొలి ఈవెంట్ సూర్యకాంతం. మా ఎన్నికల్లో నరేష్ నే సపోర్ట్ చేస్తూ ప్రచారం చేసిన మెగా బ్రదర్ నాగబాబుపై శివాజీకి ఎలాంటి భేషజం లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఇక నాగబాబు తనయ సినిమాకి శివాజీరాజా కావాల్సినంత ప్రమోషన్ చేయడం స్పోర్టింగ్ స్పిరిట్ అనే చెప్పాలి.

సూర్యకాంతం అంటే నెగెటివ్ పాత్ర అని అనుకోవద్దు. అదో ఇంట్రెస్టింగ్ రోల్. గుండమ్మ కథలా అనిపించే సినిమా ఇది అని లిరిసిస్ట్ కృష్ణకాంత్ ఈ వేదికపై తెలిపారు. ఇక సూర్యకాంతం మా బంగారం అంటూ హీరో రాహుల్ విజయ్ తండ్రిగారైన విజయ్ మాస్టార్ కితాబిచ్చారు.
Please Read Disclaimer