భార్య కు ఉల్లి కమ్మలు గిఫ్ట్ ఇచ్చిన సూపర్ స్టార్

0

ప్రస్తుతం దేశం లో ఉల్లిగడ్డల రేట్ల కు రెక్కలు వచ్చాయి. ఏరియాను బట్టి 120 నుండి 250 వరకు కూడా ఉల్లి గడ్డలు ధర పలుకుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేనంతగా ఉల్లి గడ్డల రేట్లు పెరగడంతో సోషల్ మీడియాలో మీమ్స్ ఏ స్థాయిలో ట్రెండ్ అవుతున్నాయో మనం ప్రతి రోజు చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో ఉల్లి గడ్డల దొంగలు అంటూ సెన్షేషనల్ గా ట్రెండ్ అవుతుంది. ఇక కొందరు గతంలో బంగారం అని పిలుచుకునే వాళ్లం.. ఇప్పుడు ఉల్లి గడ్డ అంటూ పిలుచుకుంటున్నాం అంటున్నారు.

ఉల్లి గడ్డలపై ఈ స్థాయి లో మీమ్స్ వస్తున్న సమయంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సరదాగా తన భార్య కు ఉల్లి గడ్డల తో ప్రత్యేకంగా డిజైన్ చేయించిన చెవి కమ్మలు గిఫ్ట్ గా ఇచ్చాడు. తన భార్యకు తాను ఇచ్చిన చాలా ఖరీదైన బహుమానం అంటూ ఈ ఫొటోను సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు. అక్షయ్ కుమార్ సెన్సాఫ్ హ్యూమర్ మరియు ఆయన కామెడీ టైమింగ్ కు అంతా ఫిదా అవుతున్నారు. అక్షయ్ కుమార్ వంటి భర్త లభించడం ట్వింఖిల్ ఖన్నా అదృష్టం అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

ఉల్లి గడ్డల రేట్లు దేశ వ్యాప్తంగా భారీగా ఉన్న సమయం లో ఇలాంటి కామెడీ లు ఇలాంటి మీమ్స్ చాలానే చూస్తూ ఉన్నాం. కాని సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ వంటి వారు ఈ విషయ మై కూడా స్పందించడం ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో.. సోషల్ మీడియాలో ఏ స్థాయిలో ఈ ఉల్లి ధరలకు సంబంధించిన మీమ్స్ వైరల్ అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
Please Read Disclaimer