దొరసాని ఆన్ ఫైర్

0

స్టార్ కిడ్ అయినా.. ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేని హీరోయిన్ అయినా ఎవరైనా సరే కష్టపడితేనే.. లక్కు కలిసి వస్తేనే సక్సెస్ దక్కుతుంది. అయితే స్టార్ కిడ్స్ కు ఉన్న ప్లస్ ఏంటంటే వారికి గుర్తింపు త్వరగా దక్కుతుంది. ఫలానా వారి అమ్మాయి అని.. ఫలానావారి అబ్బాయి అనే టాగ్ ఉంటుంది కాబట్టి వెంటనే ప్రేక్షకుల మనసుల్లో రిజిస్టర్ అవుతారు. అదే కొత్త హీరోయిన్ అనుకోండి .. సక్సెస్ సాధించేవరకూ ఆ మాత్రం గుర్తింపు కూడా దక్కడం కష్టం. డా.రాజశేఖర్ – జీవిత దంపతుల రెండవ కుమార్తె శివాత్మిక ‘దొరసాని’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. సినిమా విజయం సాధించలేదు కానీ శివాత్మిక నటనకు ప్రశంసలు దక్కాయి. సినిమా ఫ్లాప్ అయినా కూడా ఇలా ప్రశంసలు దక్కించుకోవడం అరుదుగా జరుగుతుంది.

‘దొరసాని’ ఒక పీరియడ్ ఫిలిం.. పైగా ట్రెడిషనల్ గా కనిపించాల్సి రావడంతో గ్లామర్ కు స్కోప్ లేకుండా పోయింది. అయితే శివాత్మిక ఆ లోటు తీర్చడానికి సోషల్ మీడియాను వాడడం మొదలుపెట్టింది. ఈ జెనరేషన్ హీరోయిన్ కాబట్టి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. తన ఇన్స్టా ఖాతాకు ఫాలోయర్ల సంఖ్య భారీగా ఏమీ లేదు కానీ యాక్టివ్ గా ఉంటోంది. ఒక సినిమా హిట్ అయితే ఆటోమేటిక్ గా ఆ నంబర్ పెరుగుతుంది. ఆ ఖాతా ద్వారానే రీసెంట్ గా తను పాల్గొన్న ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో శివాత్మిక బ్లాక్ కలర్ శాటిన్ గౌన్ ధరించి సూపర్ పోజులిచ్చింది. అందులో ఒక ఫోటోకు ‘అంతే’ అని క్యాప్షన్ ఇచ్చింది. నిజమే గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేస్తే నెటిజన్ల పరిస్థితి అంతే’గా! ఈ ఫోటోలలో హైలైట్ మాత్రం గ్లామర్ అనుకుంటారేమో కానీ.. అంతకంటే ఆకర్షణీయమైన శివాత్మిక కళ్ళు.

ఈ ఫోటోలకు నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. “బ్యూటిఫుల్”.. “జీవిత గారిలా ఉన్నావు”.. “అందం అమ్మాయి అయితే నీలా ఉండాలి”..”దొరసాని ఆన్ ఫైర్” అంటూ పొగడ్తలు కురిపించారు. ఇక శివాత్మిక నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఒకటి రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని సమాచారం.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home