బార్డర్ క్రాస్ చేసినా టీనేజీ మిసమిసలే

0

దాదాపు రెండు దశాబ్ధాల క్రితం ఇష్టం సినిమాతో కెరీర్ ప్రారంభించిన శ్రీయ ఇన్నాళ్లు ఎదురేలేని కెరీర్ ని సాగించిందనే చెప్పాలి. కెరీర్ లో దాదాపు 60 పైగా సినిమాల్లో నటించింది ఈ అమ్మడు. ఇటు తెలుగు అటు తమిళం రెండు చోట్లా టాప్ స్టార్ల సరసన నటించేసింది. సౌత్ లో శంకర్- రాజమౌళి సహా దాదాపు అందరు అగ్ర దర్శకుల సినిమాల్లోనూ ఈ సీనియర్ బ్యూటీ నటించింది. అటు బాలీవుడ్ లోనూ తన లక్ చెక్ చేసుకుంది.

అయితే నిరంతరం నవతరం ట్యాలెంటుతో పోటీపడుతూ శ్రీయ ఇన్నాళ్లు కెరీర్ బండిని ఎలా నెట్టుకురాగలిగింది? అంటే అందుకు కారణం తన అందాన్ని కాపాడుకోగలగడం అనే చెప్పొచ్చు. గొప్ప క్రమశిక్షణ.. వృత్తి నిబద్ధత మరో కారణం అని చెప్పాలి. కథానాయికగా సుదీర్ఘ కాలం కెరీర్ పరంగా నిలదొక్కుకోవాలంటే అందాన్ని కాపాడుకునే గుణం చాలా ముఖ్యం. నిరంతరం జిమ్ యోగా అంటూ తపించాలి. ఆహార నియమాల్ని పాటిస్తూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మాత్రమే అందాన్ని కాపాడుకోవడం సాధ్యం. ఈ విషయాల్లో అందాల శ్రీయను కొట్టేవాళ్లే లేరు.

35 ఏజ్ బార్డర్ దాటినా శ్రీయ ఇప్పటికీ అదే టీనేజీ మిసమిసలతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోంది. ఇటీవలే విదేశీ క్రీడాకారుడు ఆండ్రూ కోశ్చీవ్ ని పెళ్లాడిన ఈ బ్యూటీ పెళ్లి తర్వాతా అంతకుమించి వయ్యారాల వడ్డనలు చేస్తోంది. ఓ వైపు ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే మరోవైపు నటనను కొనసాగిస్తోంది. పనిలో పనిగా తనకు ఉన్న క్రేజును క్యాష్ చేసుకుంటూ ప్రకటనల్లో నటిస్తూ.. వీలున్నప్పుడల్లా రిబ్బన్ కటింగులు చేస్తోంది. తాజాగా ఓ జువెలరీ షోరూమ్ లాంచ్ లో పాల్గొన్న శ్రీయను చూసినవారు ఒక్కసారిగా షాక్ తిన్నారు. నీలి వర్ణం డిజైనర్ టాప్ లో ట్రెడిషనల్ గా దర్శనమిచ్చిన ఈ అమ్మడు ఎంతో లవ్ లీ ఛామ్ తో మతి చెడగొట్టింది. ఇంకా 20 ఏజ్ లోనే ఆగిపోయిందా? అన్నంతగా స్లిమ్ గా కనిపించిన ఈ బ్యూటీ కుర్రాళ్లకు కంటిపై కునుకు కరువయ్యేలా చేసిందంటే నమ్మండి.

Click Here For More Photos
Please Read Disclaimer