అలా చేశాడంటే నమ్మలేకపోతున్నా : శోభన

0Shobhana-has-to-say-about-Dileepమలయాళం చిత్ర పరిశ్రమలో ఎన్నడూ లేని విధంగా గత కొన్ని రోజులుగా సంచలనంగా మారిన నటుడు దిలీప్ కుమార్ కేసు పై అక్కడి సినీ ప్రముఖులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. హిరోయిన్ ని అత్యాచార ప్రయత్నం చేశాడని ఆరోపణలు ఎదుర్కొన్న విషయం అందరికి తెలిసిందే. అయితే కొంతమంది దిలీప్ పై విమర్శలు చేస్తుండగా మరికొందరి ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.

రీసెంట్ గా మరో డాన్సర్ కమ్ యాక్టర్ దిలీప్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని తెలియజేసింది. మంచి నృత్య కారిని గా పెరు తెచ్చుకున్న శోభన దిలీప్ తో తనకు ఉన్న స్నేహబందం గురించి చెప్పింది. దీలిప్ చాలా ఏళ్లుగా తనకు తెలుసని చాలా మంచి వ్యక్తి అని చెప్పింది. షూటింగ్ జరిగే సమయాల్లో అందరిని నవ్విస్తూ ఉండేవాడు అలాంటిది ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అంటే నమ్మలేకపొతున్నానని శోభన తెలిపారు. అలాగే దీలిప్ తో 1997 లో ఓ షూటింగ్ లో ఉన్నపుడు జరిగిన కొన్ని విషయాలను గుర్తు చేసుకుంది శోభన. ఆ రోజు తన జీవితంలో ఒక మధుర జ్ఞాపకం అంటూ.. దీలిప్ తన మిమిక్రీ తో అక్కడ ఉన్నవారందరిని నవ్వులతో ముంచెత్తాడు అని చెప్పుకొచ్చింది.

కానీ ఇప్పుడు తన జీవితం ఇలా అయినందుకు చాలా బాధగా ఉందంటోంది శోభన. అయితే దిలీప్ నేరం చేసాడని చాలా మంది అంటున్నా కొందరు ఈ తరహాలో వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.