బిగ్ బాస్ : కంటెస్టెంట్ కళ్లలో కారం పెట్టిన మరో కంటెస్టెంట్

0

బిగ్ బాస్ అంటేనే వివాదాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ భాషలో బిగ్ బాస్ షో జరిగినా కూడా వివాదాస్పదం అవ్వడం ఖాయం. తెలుగులో మూడు సీజన్ లు జరిగితే ఆ మూడు సీజన్ లు కూడా ఏదో ఒక వివాదాస్పద అంశంను మోస్తూనే వచ్చాయి. ఇక తమిళ బిగ్ బాస్ మూడు సీజన్ లను కూడా తీవ్రమైన వివాదాలు వెంటాడాయి. ప్రస్తుతం మలయాళ బిగ్ బాస్ సీజన్ 2 ప్రసారం అవుతుంది. సగానికి పైగా పూర్తి అయిన ఈ సీజన్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని ఏకంగా పోలీసు కేసు వరకు వెళ్లింది.

మలయాళ బిగ్ బాస్ షోలో భాగంగా కంటెస్టెంట్స్ కు స్కూల్ టాస్క్ ఇచ్చారు. అందులో భాగంగా కొందరు టీచర్లుగా కొందరు అల్లరి పిల్లలుగా మారారు. ఈమద్య కాలంలో బాగా ఫేమస్ అయిన రంజిత్ కుమార్ అల్లరి పిల్లాడి పాత్ర పోషించాడు. టాస్క్ లో భాగంగా రేష్మ కూడా స్టూడెంట్ గా నటిస్తుంది. రేష్మ బర్త్ డే వేడుక అంటూ కంటెస్టెంట్స్ అంతా సెబ్రేషన్ చేస్తున్నారు. ఆ సమయంలోనే రేష్మకు రంజిత్ కుమార్ పచ్చి కారం ముద్దను తీసుకు వచ్చి కళ్లకు అద్డాడు.

ఆ మంటnతో ఆమె విలవిలాడిపోయింది. మొదట అంతా కూడా అది నటన అనుకున్నారు. కాని ఆమె పరిస్థితిని గుర్తించి వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరలించారు. రంజిత్ కుమార్ ను కన్ఫెషన్ రూంకు తరలించి మందలించడంnతో పాటు ఆయన్ను బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇదే సమయంలో రంజిత్ కుమార్ పై కేసు నమోదు అయ్యింది. బిగ్ బాస్ షో నిర్వాహకులపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా మలయాళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ కేసు వల్ల బిగ్ బాస్ సీజన్ అర్థాంతరంగా ఆగిపోయే అవకాశం ఏమైనా ఉందా అంటూ ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-