బ్యాక్ చూపించి టెంమ్ట్ చేస్తోంది

0

అక్కినేని హీరోలతో కొద్ది గ్యాప్ లోనే సవ్యసాచి మరియు మిస్టర్ మజ్ను చిత్రాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు మరియు తమిళంలో పలు సినిమాల్లో నటిస్తోంది. మరికొన్ని చర్చల దశలో కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈమె ఒక సినిమా షూటింగ్ నిమిత్తం తమిళనాడులోని పొల్లాచిలో ఉంది. సినీ సెలబ్రెటీలు అధికంగా ఇష్టపడే షూటింగ్ లొకేషన్ పొల్లాచి అంటూ ఉంటారు.

నిధి అగర్వాల్ కు కూడా ఆ ప్రాంతం బాగా నచ్చిందట. నిధి అగర్వాల్ హోయలు ఒలుకుతూ నిల్చుని ఉండగా వెనుక నుండి తీసిన ఈ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. లంగా ఓణీలో అదీ వెనుక నుండి నిధి అగర్వాల్ కుర్రాళ్ల హృదయాలను దోచేస్తోంది. ఇన్ని రోజులు ముందు నుండి చూసి పనిపోయిన ఫ్యాన్స్ ఇప్పుడు అందాల నిధి బ్యాక్ బ్యూటీని చూసి ఫిదా అవుతున్నారు.

సోషల్ మీడియాలో ఈ ఫొటోకు భారీగా లైక్స్ తో పాటు చాలా చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి. ట్రెడీషనల్ లుక్ లో సూపర్బ్ గా ఉన్నావని.. ఈ కాస్ట్యూమ్స్ లో నిన్ను ముందు నుండి కూడా చూడాలని ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నీ బ్యాక్ అందం ముందు పొల్లాచి అందం కూడా చిన్న బోయింది అంటూ నిధి అగర్వాల్ అభిమానులు ప్రశంసలు గుప్పిస్తున్నారు.
Please Read Disclaimer