మామ్ బర్త్ డే.. ముక్కు గిల్లి ఏమిటా సరసం

0

సీనియర్ నటుడు శక్తి కపూర్ గారాల పట్టిగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టి తండ్రిని మించిన తనయగా పేరు తెచ్చుకుంది శ్రద్ధా కపూర్. పక్కింటి అమ్మాయి తరహా పాత్రలే కాదు.. గ్లామరస్ రోల్స్ లోనూ చెలరేగడం తన ప్రత్యేకత. ఛాన్స్ దక్కినప్పుడల్లా ప్రయోగాత్మక పాత్రల తో తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. `ఆషిఖీ 2`.. `ఏక్ విలన్`.. `హైదర్`.. `ఏబీసీడీ 2`..`బాఘి`.. `హసీనా పార్కర్` వంటి చిత్రాలతో బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని.. స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. గతేడాది `సాహో`.. `చిచ్చోర్` చిత్రాల తో మంచి విజయాలను అందుకుంది.

శ్రద్ధా కపూర్ సోషల్ మీడియా లో ఎప్పుడూ చురుకుగా ఉంటుంది. తాజాగా ఆమె తన మదర్ శివాంగి కపూర్ పుట్టిన రోజుని పురస్కరించుకుని ఓ ఫోటోని ఇన్ స్టాగ్రామ్.. ట్విట్టర్ లో అభిమానుల తో పంచుకుంది. తన తల్లితో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ “నిత్యం దైవం.. పుట్టిన రోజు శుభాకాంక్షలు మమ్మీ“ అని పేర్కొంది. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఆ ఫోటోలో శ్రద్ధా చేసే చిలిపి పనే ఆసక్తిని రేకెత్తిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. ఆమె తన తల్లి శివాంగి ఓ సోఫాలో కూర్చొని ఉండగా.. తల్లి ముక్కును గిల్లుతూ కనిపించింది శ్రద్ధా. ఫోటోలో ఆ చిలిపి పనికి నెటిజనులు తమదైన శైలిలో సెటైర్స్ వేస్తున్నారు. తల్లి కూతుళ్ళ అనుబంధానికి… వారి మధ్య మంచి స్నేహానికి ఇది నిదర్శనం!! అంటూ శివాంగి కపూర్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఇప్పుడీ ఫోటో మిలియన్ వ్యూస్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటం విశేషం.

శ్రద్ధాకపూర్ తాజాగా టైగర్ షరాఫ్ తో మరోసారి కలిసి నటించిన `బాఘి3` చిత్రం ఇటీవల విడుదలై మంచి కలెక్షన్లతో రన్ అవుతుంది. వంద కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. టైగర్ షరాఫ్ చేసే యాక్షన్ కి.. శ్రద్ధా గ్లామర్ కి.. వీరి మధ్య కెమిస్ట్రీకి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే గతేడాది వరకు బ్యాక్ టూ బ్యాక్ వరుస సినిమాల తో ఫుల్ బిజీగా గడిపిన శ్రద్ధా చేతిలో ప్రస్తుతం ఒక్క ప్రాజెక్ట్ కూడా లేకపోవడం గమనార్హం.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-