పసుపు నిక్కరు.. పింక్ టాప్ వారెవ్వా!

0

సాహో` బ్యూటీ శ్రద్ధా కపూర్ బిజీ లైఫ్ గురించి తెలిసిందే. బాలీవుడ్ లోనే బిజీయెస్ట్ హీరోయిన్ గా క్షణం తీరిక లేకుండా ఉంది. ఇటీవలే సాహో (హిందీ)- చిచ్చోర్ చిత్రాలతో సైమల్టేనియస్ గా రెండు విజయాల్ని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం స్ట్రీట్ డ్యాన్సర్ 3డి చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు మరిన్ని భారీ చిత్రాలకు సంతకాలు చేయనుందని తెలుస్తోంది.

సానియా జీవితకథను హిందీలో సినిమాగా తీయడానికి ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా హక్కులు చేజిక్కించుకున్నారు. సైనా బయోపిక్ ని వదులుకున్నా.. సానియా బయోపిక్ లో నటించే అవకాశం శ్రద్ధానే వరించనుందని తెలుస్తోంది. మరోవైపు శ్రద్ధా తీరిక సమయాల్లో పూర్తిగా రిలాక్స్ మోడ్ లో ఉండేందుకు ఇష్టపడుతోంది.

ఇదిగో ఇలా ముంబైలో షికారుకు వెళుతూ శ్రద్ధా లేటెస్టుగా ఇలా కెమెరా కంటికి చిక్కింది. పసుపు రంగు షార్ట్.. పింక్ టాప్ లో స్మైల్ ఇస్తూ .. హాయ్ చెబుతూ చాలానే సందడిగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు యువతరంలో వైరల్ గా మారాయి. శ్రద్ధా అందానికి.. ఆ స్మైల్ కి దాసోహం కానిది ఎవరు? అందుకేగా ప్రభాస్ అంతటివాడే శ్రద్ధాకు ఫ్యాన్ గా మారిపోయి సాహోలో ఛాన్స్ ఇచ్చింది అంటూ ముచ్చటించుకుంటున్నారంతా.