శ్రద్ధగా కాఫీ క్రీం ప్రమోషన్

0

శ్రద్ధా దాస్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న భామే. దాదాపు డజనుకు పైగా తెలుగు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులో ఫేడ్ అవుట్ అయిపోయింది లెండి. ప్రస్తుతం కన్నడలో సినిమాలు చేస్తోంది.ఈ బ్యూటీ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఆర్య 2’ లో నటించింది. ఈమధ్య ‘ఆర్య 2’ సినిమా రిలీజై పదేళ్లు అయిన సందర్భంగా సోషల్ మీడియాలో 10 ఇయర్స్ ఆఫ్ ఆర్య-2 అంటూ హంగామా జరిగింది. దీంతో ఈ హాటీ ఒక్కసారిగా శ్రద్ధ కూడా లైమ్ లైట్ లోకి వచ్చింది.

ఇంతకీ ఈ భామ ఇన్స్టాగ్రామ్ లో ఏం చేస్తుందా అని పరిశీలిస్తే ఇతర భామల తరహాలోనే హాటు ఫోటో షూట్లు చేస్తూ వేడి పెంచుతూనే ఉంది. పనిలో పనిగా కొన్ని ప్రమోషన్స్ కూడా చేస్తోంది. రీసెంట్ గా ఒక ఫోటో పోస్ట్ చేసి “నా చర్మం గురించి నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. అందుకే ఎం కెఫీన్ వారి బాడీ పాలిషింగ్ గిఫ్ట్ కిట్ ను వాడుతున్నాను. కెఫీన్ ఉండే ఉత్పత్తులను మార్కెట్ చేసే ఫస్ట్ బ్రాండ్ ఇది. చాకో బాడీ బటర్ చర్మాన్ని తేమగా ఉంచుంది. కాఫీ బడీ స్క్రబ్ శరీరం టాన్ తగ్గిస్తుంది. మృతకణాలను తొలగిస్తుంది. ఈ ఉత్పత్తులు చాకొలేట్ వాసన వస్తాయి. అందుకే మీరు ఒకసారి ట్రై చేయండి” అంటూ ప్రచారం చేసింది.

ఫోటో విషయానికి వస్తే ఒక డెనిమ్ షార్ట్.. పూల టాప్ ధరించి అందాలు ధారబోస్తూ పైన ఒక తెలుపు రంగు నైట్ గౌన్ లాంటిది పైన వేసుకొని పైన నొక్కి ఒక్కాణించిన కాఫీ క్రీమ్ ను కాలిపై సుతారంగా పూసుకుంటూ ఒక సున్నితమైన పోజిచ్చింది. మన తెలుగు వారికి మంచి కాఫీ లాంటి సినిమాలను కమ్ములగారు పరిచయం చేసి పుణ్యం కట్టుకున్నారు.. ఇప్పుడు ఎం కెఫీన్ క్రీమ్ తో శ్రద్ధ కాఫీ క్రీమ్ భామగా మారిపోయింది. ఆ క్రీమ్ ను మనం పూసుకుంటే ఎలా ఉంటుందో దేవుడెరుగు.. పూసుకున్న భామను చూస్తుంటే ఇంట్రెస్టింగ్ గానే ఉంది.
Please Read Disclaimer